నాని హీరోగా నటిస్తోన్న 28వ చిత్రం అంటే సుందరానికీ..
. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అంటే సుందరానికి,..
చిత్రంతో మలయాళ నటి నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది.ఈ చిత్రంలో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్
అనేది నాని పాత్ర పేరు. ఈ చిత్రంలో నదియ, హర్ష, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. తాజా గా ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన ఏడు రిలీజ్ డేట్స్ను ప్రకటించి కన్ఫ్యూజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా మే నెలలోనే విడుదల కానుందని తెలిసింది.
మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు బ్లాక్ చేయకూడదా


Leave a comment
Leave a comment