‘‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంతదూరం అయిన తీసుకుని వెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకుని వచ్చింది ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటునుంచి వస్తుందో ఎప్పుడువస్తుందో ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్..దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ’’ అని నాగచైతన్య పలికే డైలాగ్స్ వాయిస్ ఓవర్‌తో ‘కస్టడీ’ చిత్రం టీజర్ విడుదలైంది. నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శ కత్వంలో రూపొందిన సినిమా ఇది. కృతీశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అరవింద్‌స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా మే 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.