మలయాళం నటులు షానే నిగమ్, శ్రీనాథ్ భాసిలపై నిషేధం విధించారు. షూటింగ్స్‌లకు సరైన సమయానికి హాజరుకాకపోవడం, తోటి నటీనటులతో సరైన ప్రవర్తన లేకపోవడం, డ్రగ్స్ వినియోగం..అంటూ మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఇద్దరిపై నిషేధం విధించింది. మలయాళం మూవీ ఆర్టిస్ట్‌అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫేడరేషన్ ఆఫ్ కేరళ, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లు కలిసి ఏకాభిప్రాయంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మలయాళ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది.
‘‘ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. అలాంటి వారితో వర్క్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. లొకేషన్‌కు లేట్‌గా వచ్చేవారు కూడా ఉన్నారు. వీరితో వర్క్ చేయడం అనేది చాలా ఇబ్బందలుకు దారి తీస్తుంది. వీరికి సీనియర్ యాక్టర్స్ అన్న గౌరవం లేదు’’ అంటూ మలయాళ చిత్రపరిశ్రమషానే నిగమ్, శ్రీనాథ్‌ల నిషేధానికి సంబంధించిన పరోక్ష నోట్‌ను విడుదల చేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే..నిర్మాత సోఫియా పాల్ గతంలో షానే నిగమ్ ప్రవర్తన పట్ల మలయాళ చిత్రపరిశ్రమలోనియూనియన్స్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.