Jr.NTR: హాలీవుడ్‌లో ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ ఫ్రాంౖచైజీ చిత్రాలను తీశారు హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్(james gunn). అయితే ఆయన ఇప్పుడు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న జేమ్స్ గన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ’ చిత్రంలో ఇండియన్ యాక్టర్‌ను తీసుకోవాలనుకున్నప్పుడు ఏ ఎవర్నీ ఫ్రిఫర్ చేస్తారు? అన్న ప్రశ్న జేమ్స్‌ముందుకు వచ్చినప్పుడు..‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటాను అని ఆయన బదులిచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ హాలీవుడ్‌కు చేరిందనే టాక్‌తో ఆయన అభిమానులు చాలా హ్యాపీ ఫీలవుతున్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ నెక్ట్స్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లోని ‘వార్ 2’లో హృతిక్‌రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్‌తో జూనియర్ ఎన్టీఆర్ ‘రవణం’(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తారు.