దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను కొందరు హీరోయిన్స్ చక్కగా పాటిస్తారు. ఈ కోవలోకే వస్తారు కీర్తీ సురేశ్, రాశీఖన్నా. ప్రసుతం కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారీ ఇద్దరు బ్యూటీలు. అయితే లెటేస్ట్‌గా కీర్తీ సురేశ్, రాశీఖన్నా ఇద్దరూ సొంతంగా యూట్యూబ్ చానెల్స్‌ను స్టార్ట్ చేశారు. ఇందులో తమ జీవితాలకు సంబంధించిన విశేషాలు, రహాస్యాలు చెబుతా మంటు న్నారు. బాలీవుడ్‌లో ఆలియాభట్ వంటి స్టార్స్ సొంత యూట్యూబ్ చానెల్స్‌ను స్టార్ట్ చేసిన అంతగా కలిసి రాలేదు. మరి..ఈ ఇద్దరి హీరోయిన్స్ చేస్తోన్న ఈ యూ ట్యూబ్ చానెల్ ప్రయోగం ఎంతమేరకు కలిసివస్తుందనేది చూడాలి.