తెలుగులో ‘ఉగ్రం’, ‘క్రేజీఫెలో’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు మిర్నా మీనన్. అయితే ఈ బ్యూటీ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ‘ఉగ్రం’సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో ‘జైలర్’ సినిమాలో యాక్ట్ చేస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్ల డించారు హీరోయిన్ మీర్నా మీనన్.
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్’. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, సునీల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ ‘జైలర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘జైలర్’ సినిమాలో తన పాత్రను గురించి మీర్నా మాట్లాడుతూ- ‘నాకు రజనీకాంత్, శివరాజ్‌కుమార్‌గార్లతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు మీర్నా మీనన్. ఈ సినిమాలో రజనీకాంత్ సిస్టర్ పాత్రలో మిర్నా మీనన్ నటించే చాన్సెస్ ఉన్నాయి.