Surya:ఇటీవల దర్శకుడు బోయపాటి శీను, నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటిం చారు. కానీ హీరో పేరును మాత్రం ప్రకటించలేదు. 2016లో అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో ‘సరైనోడు’ వంటి హిట్ ఫిల్మ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్– బోయపాటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో హీరోగా సూర్య నటిస్తారని తెలిసింది.
బోయపాటి, సూర్యకాంబినేషన్లో ఓ సినిమా అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా హిట్ కొట్టిన దర్శకులతోనే సినిమాలు చేస్తుంటారు అల్లు అర్జున్.‘స్కంధ’తో రీసెంట్గా ఓ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నారు బోయపాటి. అల్లు అర్జున్ ‘పుష్ప’తో ఓ భారీ
హిట్ అందుకున్నారు. ఈ తరుణంలో బోయపాటితో సినిమా చేసే రిస్క్‌ను అల్లు అర్జున్ తీసుకోవపోవచ్చు.
మరోవైపు ‘ఆకాశంనీ హద్దురా’, ‘జైభీమ్’ వంటి సమాజిక అంశాల నేపథ్యంలోని సినిమాలు చేశారు సూర్యగత రెండుమూడేళ్లలో. రీసెంట్గా సైంటిఫిక్ మూవీ ‘కంగువ’ చేశారు. ఇలా వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు సూర్య. దీంతో ఈ ఎక్స్పెరమెంటల్ ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఓ మాస్ కమర్షియల్ సినిమా చేయాలనుకుని బోయపాటికి సూర్య కాల్షీట్స్ ఇచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం భార్యజ్యోతికతో కలిసి ఫారిన్ వెకేషన్లో ఉన్నారు సూర్య. తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఓ స్పష్టతరావొచ్చు. ఒక సుధాకొంగరతో సూర్య ఓ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చేస్తున్నాడు. అలాగే వెట్రిమారన్‌తో సూర్య వాడివాసల్ చేయాల్సి ఉంది. కానీ వెట్రిమారన్ ‘విడుదలై 2’తో బిజీగా ఉండటంతో ‘వాడివాసల్’ సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఈ లోపు బోయపాటితో సినిమా పూర్తి చేసేస్తారు సూర్య.