ప్రముఖ హీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా బుధవారం ప్రక టించారు. ‘‘అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీని, రాత్రి (జనవరి 25 మంగళవారం) స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉంటు న్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించు కోవాల్సినదిగా కోరు తున్నాను’’ అని బుధవారం ట్వీట్ చేశారు చిరంజీవి. మరోవైపు బుధవారం కీర్తీసురేష్ ‘గుడ్ లక్ సఖి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గెస్ట్‌గా రావాల్సి ఉంది. కానీ ఆయనకు ఇప్పుడు కరోనా సోకడంతో ఈ ఈవెంట్‌కు రారని తెలుస్తోంది.
ఇక తొలిసారి 2020లో నవంబరు 9న చిరంజీవి తొలిసారి కరోనాకు చిక్కారు. హోం క్వారంటైన్లో సరైన చికిత్స తర్వాత ఆయన తిరిగి కోలుకుని ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శ కత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. మరోవైపు ఇటీవల జరిగిన ‘బోళా శంకర్’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు చిరంజీవి. దీంతో ఈ చిత్రంబృందంలోని కొందరికీ కరోనా పాజిటివ్ వచ్చే చాన్సెస్ ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది.

