యువ హీరో తేజా సజ్జా నటించిన తాజా చిత్రం ‘హనుమాన్’ (. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమావిడుదల కావాల్సింది. కానీ విడుదలైన ‘హనుమాన్’ సినిమా టీజర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ‘హనుమాన్’ సీజీ వర్క్‌పై మరింత దృష్టి పెట్టింది చిత్రంయూనిట్. వీలైతే ఈ సినిమాను 3డీలో కూడా విడుదల చేయాలన్నది ప్రశాంత్ వర్మ ప్లాన్. భారతీయ భాషలతో పాటుగా కొన్ని విదేశీ భాషల్లో కూడా‘హనుమాన్’ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ పనులకు మరింత సమయం పట్టేలా ఉండటంతో ‘హనుమాన్’ రిలీజ్‌ను వాయిదావేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాలో తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్, విలన్‌గా వినయ్ రాయనటించగా, కీలక పాత్రలో వరలక్ష్మీశరత్‌కుమార్ నటించారు. హనుమంతుని శక్తులు పొంది, అంజనాద్రి అనే ప్రాంతాన్ని సంరక్షించే యువకుడి పాత్రలోతేజా సజ్జా నటించనట్లు చిత్రంయూనిట్ వెల్లడించింది.
From Indian Ithihaas🙏
To the Worldwide Screens🔥
Brace yourselves for a breathtaking cinematic experience!#HANUMAN
GRAND RELEASE ON JAN 12th 2024, Sankranthi in 11 Languages WW💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123@Niran_Reddy @Primeshowtweets#HanuManForSankranthi pic.twitter.com/pZ0BU0bH03
— TollywoodHub (@tollywoodhub3) July 1, 2023
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, రవితేజ ‘ఈగిల్’, మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి. పెద్ద సినిమాలు వస్తున్న సంక్రాంతికి హనుమాన్ సినిమా వస్తుందా? అనేది చూడాలి.