‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్‌హిట్ మూవీస్ తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు రాజశేఖర్‌ను తీసుకున్నారు. ఇటీవల షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట. అయితే తాజాగా ఈ సినిమాను రాజశేఖర్‌ను తప్పించారట చిత్రంయూనిట్. రాజశేఖర్ క్యారెక్టర్ పరంగా ఆమె భార్య నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ తీసుకుంటున్న ఎక్స్ట్రా కేర్ గోపీచంద్ అండ్ కోను ఇబ్బంది పెట్టిందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. గాసిప్ రాయుళ్లు చెప్పుకుంటున్న మాట. ఇక రాజశేఖర్ ప్లేస్‌లో జగపతిబాబును తీసుకునేందుకు చిత్రంయూనిట్ సన్నాహాలుచేస్తోందని తెలిసింది.
ఇక రాజశేఖర్ హీరోగా చేసిన ‘శేఖర్’(మలయాళం చిత్రం జోసెఫ్‌కు తెలుగు రీమేక్) సక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. అయితే ఈ సినిమాకు తొలుత లలిత్ అనే వ్యక్తి దర్శకుడు. కానీ ఆ తర్వాత ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల లలిత్‌ను తప్పించేశారు. ఇప్పుడు ఈ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకురాలు. ఈ సినిమా విడుదల తేదీ గురించి త్వరలోనే స్పష్టత రానుంది.