ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహామాన్ తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ కమిటైనట్లు ఫిల్మ్‌నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ‘లైగర్’ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబి నేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని, ‘జనగణమన’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట పూరీ జగన్నాథ్. అలాగే ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రానుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహామాన్‌ను తీసుకునేందుకు చిత్రబృందం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా ఈ రెండు సినిమాలకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందిస్తారా? లేక ఈ వార్తలు ప్రచారంగా ఉండిపోతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య, భీమ్లానాయక్, ఎఫ్ 3, సర్కారువారిపాట ఫైనల్ రిలీజ్ డేట్స్ ఫిక్స్