‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో దుల్కర్సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తే. అయితే ఈ మలయాళ హీరో ప్రజెంట్ ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నారు హీరోగా. అలాగే నటుడు రానా దగ్గు బాటి నిర్మాతగా బహుభాషా చిత్రం ‘కాంత’ ఉంది. అయితే రీసెంట్గా దుల్కర్సల్మాన్ హీరోగా కంటే ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సినిమాలకు సైన్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘థగ్‌లైఫ్’, సూర్య 43వ చిత్రాల్లో దుల్కర్సల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో దుల్కర్ ఓ రోల్లో యాక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా బాలకృష్ణ, కేఎస్ రవీంద్ర(బాబి) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో దుల్కర్సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ అంశాలను గమనిస్తుంటే..దుల్కర్ హీరో పాత్రలకంటే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే ఆసక్తిచూపడం సర్వత్రాచర్చనీయాంశమౌతోంది. ఇక దుల్కర్సల్మాన్ ఎన్నో ఆశలు పెట్టుకుని, కొంత ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయిన ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్న దుల్కర్సల్మాన్?
Leave a comment
Leave a comment