దిల్ రాజు ప్రొడక్షన్స్, ZEE 5 కలయికలో రూపొందిన ఒరిజినల్ ATM (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ సమర్పణలో ఎస్.హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వెబ్ సిరీస్ రూపొందుతుంది. ATM వెబ్ సిరీస్‌కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ పద్మ, నిర్మాత హన్షిత, ATM ఢైరెక్టర్ చంద్రమోహన్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ- “నిర్మాతగా 50 సినిమాలను పూర్తి చేస్తున్నాం. సినిమాలో మార్పులు వస్తున్నాయి. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనిపించింది. అప్పుడు హిందీలో సక్సెస్‌ఫుల్‌గా హిట్, జెర్సీ సినిమాలను పూర్తి చేయగలిగాం. అలా బాలీవుడ్లో దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తెలుగులో కొత్తగా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు .. కొత్త జనరేషన్ రెడీగా ఉంది. అప్పుడు హర్షిత్, హన్షితను అడిగినప్పుడు వాళ్లు రెడీ అన్నారు. నేను, శిరీష్ వాళ్లకి బాధ్యతలను అప్పగించాం. ముందు సినిమాలను చేయించాలని అనుకున్నాం. అయితే గత రెండేళ్లుగా కంటెంట్‌లో మార్పు వచ్చింది. అదే సమయంలో హరీష్ శంకర్ నాకు ఫోన్ చేసి ఇలా చంద్రమోహన్ కాన్సెప్ట్ గురించి చెప్పాడు. నేను విన్నాను. తర్వాత జీ 5తో ఉన్న అనుబంధంతో వాళ్లతో కలిసి ప్రయాణించాం. హరీష్ శంకర్, హన్షిత, హర్షిత్ నిర్మాతలుగా ఈ ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేయాలనుకుని ముందుకు వచ్చాం. 2022లో ఏటీఎం వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. కొత్త కాన్సెప్ట్‌తో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైన్మెంట్తో అన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి వెబ్ సిరీస్ చేశాం. మా బ్రాండ్ వేల్యూతో మీ ముందుకు వస్తున్నాం. దీనికి శిరీష్ సమర్పకుడిగా ఉంటారు. ఎస్.హరీష్ శంకర్, హర్షిత్, హన్షిత నిర్మాతలుగా ఉంటారు. వెబ్ సిరీస్‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాలను కూడా వాళ్లు చేయబోతున్నారు. త్వరలోనే ఆ వివరాలను ప్రకటిస్తారు. హన్షిత, హర్షిత్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ను ముందుకు తీసుకెళ్లాలి. నా లైఫ్‌లో సురేష్ ప్రొడక్షన్స్‌లా 50 ఏళ్ల లోగోను చూడాలని అనుకుంటున్నాను’’ అన్నారు.
తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకి చెందిన దిల్‌రాజు ప్రొడక్షన్ ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, ZEE 5 కలయికలో రూపొందిన ఒరిజినల్ ATM (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ సమర్పణలో ఎస్.హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వెబ్ సిరీస్ రూపొందుతుంది. ATM వెబ్ సిరీస్‌కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ZEE 5 వైస్ ప్రెసి డెంట్ పద్మ, నిర్మాత హన్షిత, ATM ఢైరెక్టర్ చంద్రమోహన్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డైరెక్టర్ చంద్ర మోహన్ అవకాశం ఇచ్చిన జీ5, `దిల్` రాజు,లకు ధన్యవాదాలు
అన్నారు.
హన్షిత మాట్లాడుతూ ‘‘20 ఏళ్లు ముందు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్టార్ట్ అయ్యింది. డాడీ, శిరీష్‌గారు ప్రేక్షకుల ఆశీర్వాదాలతో ఎన్నో హిట్స్, సూపర్ హిట్ సినిమాలు చేశాం. ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలోఇక అడుగు పెడుతున్నాం“ అన్నారు.
ఎస్.హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘డబ్బులుంటే అందరూ ప్రొడ్యూస్ చేయలేరు. అదొక ఆర్ట్. ఎలా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పుడు మా రాజన్న(దిల్ రాజు) మైండ్లోకి వచ్చారు. తనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే దీంతో మా హన్షిత, హర్షిత్, శిరీషన్న నిర్మాతలుగా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాం. జీ5 గారితో కలిసి వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు.