Dhanush: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ధారావి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రెడీ అవు తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీ కరణ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. ధనుష్ పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. కాగా స్వామివారి భక్తులకు అసౌకర్యం కలుగుతుందనే కారణంతో ఈ సినిమా షూటింగ్ అను మతులు రద్దు అయ్యాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్నారు. ఆయనది డాన్ రోల్ అనిసమాచారం. ‘డాన్’(2007), ‘దేవదాస్’(2018) చిత్రాల తర్వాత నాగార్జున మళ్లీ ఓ డాన్ రోల్ చేస్తున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో రష్మికామందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 51వ సినిమాగా రానున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
Dhanush: తిరుపతిలో ఆగిపోయిన ధనుష్ సినిమా
ధనుష్ కెరీర్లో 51వ సినిమాగా రానున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
Leave a comment
Leave a comment