Avatar2: అవతార్ చిత్రం సినీప్రేమికుల మనసులను ఎంతలా దోచుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జేమ్స్‌కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను తిరగరాసింది. దీంతో జేమ్స్‌కామెరూన్ దర్శకత్వంలోనే అవతార్ 2, అవతార్ 3, 4, 5 చిత్రాలను ప్రకటించారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అవతార్ 2, అవతార్ 3 చిత్రాలను ఏకకాలంలో చిత్రీ కరించారు. కరోనా పరిస్థితులు లేకపోయిఉంటే అవతార్ 2 గత ఏడాది డిసెంబరులో థియేటర్స్‌కు వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు అవతార్ 2 మాత్రం ఈ ఏడాది డిసెంబరులో థియేటర్స్‌కు రానుంది. అలాగే అవతార్ 2 టీజర్‌ను మే 6న విడుదల చేస్తున్నారు. అవతార్ చిత్రం ఆకాశం నేపథ్యంలో సాగితే, అవతార్ 2 చిత్రం సముద్రంలోతుల్లో సాగుతుంది. అందుకే ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో జరిపారు. అయితే అవతార్ సృష్టించిన ప్రపంచ బాక్సాఫీసు రికార్డులను అవెంజర్స్ ఎండ్‌గేమ్ బద్దలు కొట్టింది. మరి..అవెంజర్స్ఎండ్గేమ్ బాక్సాఫీస్ లెక్కలను అవతార్ 2 చిత్రం తిరగరాస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అవతార్ 2 సినిమాను ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల చేయాలనుకుంటున్నారు.
Samantha Varundwavan webseries: సమంత సెకండ్ వెబ్‌సిరీస్ ఫిక్స్!