ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండి యన్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలిపార్టు పుష్ప: ద రైజ్ సినిమా డిసెంబరు 17న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు డిసెంబరు 24న విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో పడ్డారట పుష్ప అండ్ టీమ్. కానీ డిసెంబరు 24న నాని నటించిన శ్యామ్‌సింగ రాయ్ విడుదలకు సిద్ధమైంది. మరి..ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలైతే మాత్రం మార్కెట్ పరంగానానికి తంటాలు తప్పవు. పైగా నాని నటించిన గత రెండు చిత్రాలు వి, టక్‌జగదీష్ చిత్రాలు ఓటీటీలో విడుదలై మిశ్రమ ఫలితాలను దక్కించుకున్నాయి. ఈ తరుణంలో నానికి తప్పనిసరిగా ఓ హిట్ కావాలి. మరి..అల్లు అర్జున్ కొత్త ప్లాన్ నానికి తంటాలు తెస్తుందా?