అల్లరి నరేశ్ కెరీర్లో రూపొందుతున్న 62వ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా జూన్ 30న నరేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబరులో స్టార్ట్కానుంది. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.