రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా జవనరి 07 విడుదలకు రెడీ అయ్యింది. అయితే ఒక్కరోజు ముందుగా ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘గుంగూబాయి కతియావాడి’ విడుదలకు షెడూలైంది. గుంగుబాయి కతియావాడి చిత్రాన్ని ఇప్పుడు ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. ఇందులో ఆశ్యర్యం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే..సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోని గంగుబాయి కతియావాడిలో హీరోయిన్ ఆలియాభట్‌యే ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఓ హీరోయిన్‌గా నటించారు. సో..ఒకే హీరోయిన్ ఒకే సమయంలో రెండు సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనడం అంటే కుదరని పని. పైగా గంగూబాయి కతియావాడి సినిమాకు కథ రిత్యా ఆలియానే హీరో. సో..ఈ సినిమా ప్రతి ప్రమోషన్‌లో
ఆలియా ఉండాల్సిందే. ఇటు ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్‌లో కూడా ఆలియా కనిపించాలి. ఇది భారీబడ్జెట్ చిత్రమే కాదు. ఆలి యాకు సౌత్‌లో తొలి సినిమా అని గుర్తుతెచ్చుకోవాలి. అలాగే గంగుబాయి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు (తెలుగు టీజర్ ఆల్రెడీ రిలీజైంది)
ఇంకో హైలైట్ విషయం ఏంటంటే.. గంగుబాయి కతియావాడి సినిమాను నిర్మించిన పెన్‌స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడయే ‘ఆర్‌ఆర్‌ఆర్’ని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏ నిర్మాత అయిన తాను నిర్మించిన రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదలై, థియేటర్స్, కలెక్షన్స్ షేర్ అవ్వాలని కోరుకోడు. ఆ ప్రకారం ఊహించినట్లుగానే గంగుబాయి సినిమా వాయిదా పడింది.