రెండేళ్ల క్రితం దర్శకుడు తేజ బర్త్ డే సందర్భంగా ‘అలివేలుమంగ వెంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసుర’ అనే సినిమాను ప్రకటించారు. ఈ రెండు చిత్రాల్లో ‘అలివేలుమంగ వెంకటరమణ’లో గోపీచంద్ హీరోగా నటిస్తారని బాగా ప్రచారం జరిగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జయం’, ‘నిజం’ చిత్రాల్లో గోపీచంద్ విలన్‌గా నటించాడు. కానీ ఈ సినిమా ఎందుకో పట్టాలేక్కలేదు. ఈ గ్యాప్‌లో మారుతితో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేసి ప్లాప్మూటగట్టుకున్నాడు గోపీచంద్.
రీసెంట్గా 2022 దసరా ఫెస్టివల్ సందర్భంగా తన నెక్ట్స్ మూవీ గోపీచంద్ హీరోగా ఉంటుందన్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శ్రీనువైట్ల. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే కన్నడ కమర్షియల్ డైరెక్టర్ హర్షకు చాన్స్ఇచ్చారు గోపీచంద్. తన కెరీర్లో 25వ సినిమా ‘పంతం’ను నిర్మించిన నిర్మాత కేకే రాధామోహన్ బ్యానర్లోఈ సినిమా చేస్తున్నారు గోపీచంద్. ఇది ఆయన కెరీర్లో 31వ సినిమా. ఇలా టాలీవుడ్ దర్శకులు తేజ, శ్రీనువైట్లను కాదనుకుని కన్నడ దర్శకుడు హర్షకు గోపీచంద్ చాన్స్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్లో ఓ హాట్‌టాపిక్‌గామారింది.
ప్రస్తుతం ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల తర్వాత దర్శకుడు శ్రీవాస్‌తో గోపీచంద్ ‘రామబాణం’ అనే సినిమా చేస్తున్నారు. టీవీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.