నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ బీ హెచ్‌కు ఈ సినిమాయే దర్శ కుడిగా తొలి సినిమా. రెడ్ సినిమాస్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
గతంలో భ్రమమ్, యానీ సినిమాలను డైరెక్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ తాజాగా తామర సినిమాకు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. మహేశ్‌బాబు భరత్ అనే నేను సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఈ మలయాళ సినిమాటోగ్రాఫర్.
గరుడవేగ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్న సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ధన్‌రాజ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన బుజ్జి ఇలా రా సినిమాకు అంజియే దర్శకుడు. అలాగే అంజి దర్శకత్వంలోనే టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా రూపొందుతుంది. ఇలా సినిమాటోగ్రాఫర్, డైరెక్షన్ రెండు వర్క్స్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు గరుడవేగ అంజి.
సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాటోగ్రాఫర్ తమిళ హిట్ మూవీ మా నగరం సినిమాను హిందీలో ముంబైకర్‌గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే అందించిన రొమాంటిక్‌ను సినిమాను అనిల్ పాదూరి డైరెక్ట్ చేశారు. కానీ అనిల్ పాదూరి ఇంతకుముందు పూరీ దర్శకత్వంలోనే వచ్చిన సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో వర్క్ చేశారు.
అలాగే కొరియోగ్రాఫర్ బ్రిందా దక్షిణాది భాషల్లో హే సినిమాక సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో దు ల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరీ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రీసెంట్గా హీరోగా మారిన జానీ మాస్టర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా రానుందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.