‘వైశాలి’ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టి మెప్పించారు ఆదిపినిశెట్టి. ఆ సినిమాకు దర్శకుడు అరివళగన్. అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత ఆదిపినిశెట్టి, అరివళగన్ కలిసి ‘శబ్దం’ సినిమా చేస్తున్నారు. ఈచిత్రంలో కథానాయికగా లక్ష్మి మీనన్ నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో లైలా ఓ కీలక పాత్రలో నటి స్తున్నట్లుగా ప్రకటించిన చిత్రంయూనిట్ మార్చి 16న ‘శబ్ధం’ చిత్రంలో సిమ్రాన్ కూడా ఓ కీ రోల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే హీరోయిన్సిమ్రాన్కు తమిళంలో ఇది 50వ చిత్రం కావడం విశేషం. 7ఏ ఫిలింస్, ఆల్ఫా ప్రేమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భానుప్రియ శివ సహ నిర్మాత. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
2009లో వచ్చిన ‘ఈరమ్’ సినిమాకు తెలుగు డబ్బింగ్గా ‘వైశాలి’ చిత్రం 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసక్తికరం అంశం ఏం టంటే..కెరీర్ తొలినాళ్లలో ‘ఈరమ్’ సినిమాకు సంగీతం అందించిన తమన్ ఇప్పుడు ‘శబ్ధం’ చిత్రానికీ సంగీతం అందిస్తున్నారు.