RRR: అత్యధికంగా బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన భారతీయచిత్రాలుగా ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ (1980కోట్ల రూపాయలు), ప్రభాస్ ‘బాహుబలి:ది కన్‌క్లూజన్’ (1850 కోట్ల రూపాయలు), జూనియర్ ఎన్టీఆర్– రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ (1240 కోట్ల రూపాయలు), యశ్ ‘కేజీఎఫ్’ (1230 కోట్ల రూపాయలు), షారుక్‌ఖాన్ ‘పఠాన్’(1060 కోట్ల రూపాయలు) చిత్రాలు నిలిచాయి.

నిజానికి ‘కేజీఎఫ్’ చిత్రం కలెక్షన్స్‌ను ‘ఆర్ఆర్ఆర్’ దాటలేకపోయేది. అయితే ఎప్పుడైతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేశారో తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఎంతలా అంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన విదేశీ చిత్రాల టాప్‌టెన్ జాబితాలో నిలిచింది. దీంతో జపాన్‌లో వన్ మిలియన్‌కు పైగా యోన్స్(జపాన్ కరెన్సీ) కలెక్షన్స్‌ను సాధించింది. అంటే సుమారుగా 80కోట్ల రూపాయలకుపైగా అన్నమాట. ఇదే సమయంలో ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్’ సినిమాను యూఎస్, యూఎస్ఏ, తెలుగులో విడుదల చేశారు దీంతో 1150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌కే పరిమితమైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ‘కేజీఎఫ్’ను దాటింది.
