Kalki2898adbusiness: కల్కి2898ఏడీ సినిమా బుకింగ్స్ జూన్ 24 సాయంత్రం ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడవుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ‘కల్కి2898ఏడీ’ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 400 కోట్లరూపాయల మేరకు జరిగిందని ట్రేడ్ వర్గీయులు చెబుతున్నారు (Kalki2898adbusiness).
Laapataaladies: హిందీ చిత్రం లపతా లేడీస్ రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి2898ఏడీ’ సినిమా దాదాపు 800 కోట్ల రూపాయల గ్రాస్‌ను కొల్లగొడితే బ్రేక్ ఈవెన్‌గా నిలుస్తుంది. 800 కోట్ల రూపాయల గ్రాస్ అంటే దాదాపు రూ. 400 కోట్ల రూపాయల షేర్ వస్తుంది. 800 కోట్ల రూపాలయకుపైగా వచ్చే కలెక్షన్స్ అన్నీ ‘కల్కి2898ఏడీ’ సినిమా లాభాలుగా మారతాయి. కేవలం నార్త్ అమెరికాలోనే ‘కల్కి2898ఏడీ’ సినిమా విడుదలకు ముందే 3మిలియన్ డాలర్స్ మార్క్‌ను దాటేసింది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే తెలంగాణ నైజాం రీజియన్ ఈ సినిమాకు 7 కోట్ల రూపాలయ బుకింగ్స్ జరిగాయి. వీటన్నింటిని చూస్తుంటే ‘కల్కి2898ఏడీ’ సినిమా ఈజీగా వెయ్యికోట్ల రూపాలయ గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ను దాటుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్
తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి2898ఏడీ’ సినిమాకు దాదాపు రూ. 180 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. నైజాంలో 70 కోట్లు, ఆంధ్రాలో 85 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో 85 కోట్ల రూపాయల బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. ఇలా ‘కల్కి2898ఏడీ’ సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 180 కోట్ల రూపాయలుగా నిలిచింది.
Ramayana: హిందీ రామాయణ ఆగిపోయినట్లేనా?
ఓవర్సీస్, హిందీ భాషల్లో ‘కల్కి2898ఏడీ’ సినిమాకు రూ. 80 కోట్ల చోప్పున థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో ఇరవై కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్,దీపికా పదుకొనె, కమల్‌హాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మాళవికానాయర్, స్వస్థి చటర్జీ, శోభన, పశుపతి, దిశాపటానీ, బ్రహ్మానందం, అన్నాబెన్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్‌దేవరకొండ,దుల్కర్సల్మాన్, మృణాల్‌ఠాకూర్, రాజమౌళిలు కూడ ఈ సినిమాలో నటిం చారనే ప్రచారం జరుగుతోంది. సి. అశ్వినీదత్ దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్‌లో విడుదల కానుంది.