సినిమా: జీబ్రా (Zebra Movie Review)
ప్రధానతారాగణం: సత్యదేవ్, డాలీ ధనుంజయ, ప్రియాభవానీ శంకర్, సునీల్, సత్య
దర్శకుడు: ఈశ్వర్కార్తీక్
నిర్మాత: బాలసుందరం, ఎస్‌ఎన్‌రెడ్డి, దినేష్సుందరం
విడుదల తేది: నవంబరు 22, 2024
సంగీతం: రవిబస్రూర్
కెమెరా: సత్య పొన్మార్
ఎడిటింగ్: అనిల్ క్రిష్
నిడివి: 2 గంటల 44 నిమిషాలు
రేటింగ్: 2.50/5
కథ
సూర్య బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్. కానీ వీలైనప్పుడల్లా బ్యాంకు రూల్స్‌లోని లోపాలను అక్రమంగా వాడుకుంటుంటాడు. ఇందుకోసం బ్యాంకు ఉద్యోగులైన తన ప్రేయసి స్వాతి (ప్రియభవానీశంకర్), ఫ్రెండ్ హెల్ప్ (కమేడియన్ సత్యలను) తీసుకుంటుంటాడు. అలా ఓ సారి డిసౌజా (టెంపర్ వంశీ) అకౌంట్‌పై సూర్య కంట్రోల్ తీసుకుని, నాలుగు లక్షలు డ్రా చేస్తాడు. కానీ ఆ వెంటనే డిసౌజా అకౌంట్ నుంచి ఐదు కోట్లు రూపాయలు క్రెడిట్ కాబడి, వెంటనే డెబిట్ అవుతారు. ఇందుకు కారణం సూర్య అని బ్యాంకు ఉన్నతాధికారలు ఆరోపిస్తారు. కానీ ఈ ఐదుకోట్ల రూపాయల అమౌంట్ 800 కోట్ల రూపాయలతో ఓ ఎయిర్‌లైన్స్ డీల్ చేస్తున్న ఆదిత్య (డాలీ ధనంజయ)ది. డిసౌజా అకౌంట్లో క్రెడిట్ అయిన ఐదుకోట్లరూపాయల అమౌంట్ సూర్య విత్ డ్రా చేయలేదు. మరి…ఈ ఐదుకోట్ల రూపాయలు ఏమైయ్యాయి? నాలుగు రోజుల్లో ఐదు కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని ఆది పెట్టిన కండీషన్‌కు సూర్య ఒప్పుకున్నాడా? ఈ విషయంలో సూర్యకు సహాయం చేసిన బాబా (సత్యరాజ్) ఎవరు? బ్యాంకులోనే దొంగతనం చేయాలన్న సూర్య ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అయ్యింది? అన్న అంశాలను థియేటర్స్‌లో చూడాలి.
విశ్లేషణ
బ్యాంకులో అక్రమంగా జరిగే క్రైమ్స్‌కు, అండర్‌వరల్డ్ మాఫియా, స్టార్ మార్కెట్లను ముడిపెట్టి దర్శకుడు చెప్పిన కథే ‘జీబ్రా’. బ్యాంకులో క్రైమ్స్ ఎలా జరుగుతాయి? అన్న టాపిక్‌తో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఈ ఏపిసోడ్ తర్వాత సూర్య జీవితంలోకి ఆది రావడం, ఆది కంట్రోల్లో సూర్య ఉండటంతో తొలిభాగం ముగుస్తుంది. ఆది బ్యాగ్రౌండ్ స్టోరీ, బ్యాంకులో దొంగతనం చేయాలన్న సూర్య స్కెచ్, ఇందుకు సూర్యకు ఆది సహాయం చేయడం, మద్యలో సూర్యకు బాబా హెల్ప్ చేయడం, ఆపై జెన్నిఫర్ పాత్రతో వచ్చే ఓ ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది.
vishwakSen Mechanic Rocky Review: విశ్వక్సేన్ మెకానిక్ రాకీ సినిమా రివ్యూ
కథను ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ చెప్పాడు ఈశ్వర్కార్తీక్. ఓ ప్రాబ్లమ్ నుంచి సూర్య ఎస్కేప్ అయితే మరో ప్రాబ్లమ్‌లో ఇరుక్కోవడం, ఇందుకు ఆది కంట్రోల్ ఉండటం, మదన్‌గుప్తా (సునీల్) కంట్రోల్లో ఆది ఉండటం…ఇలా సీన్స్ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. మధ్యలో సత్య కామెడీ ఉండనే ఉంది. అయితే ఆది బ్యాగ్రౌండ్ స్టోరీ, ఆది రొమాంటిక్ లైఫ్, ఆది చెప్పే ఓ కథ..ఇవన్నీ సినిమాకు కాస్త అడ్డంకులుగా అనిపి స్తాయి. బ్యాంకు టెర్మినాలజీ కాస్త లోతుగా ఉంటుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు దర్శకుడు చెప్పిన స్పీడ్నుక్యాచ్ చేయడం అంటే కష్టమే. ఆది, మదన్‌గుప్తా సీన్స్ కూడా మధ్యలో బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్‌కు లాజిక్‌లు ఉండవు. సూర్యను ఇరికించడానికి, అతని అకౌంట్లో వెయ్యికోట్ల వేస్తాడు ఆది. అలాంటిది ఆదియే సూర్యకు ఐదు కోట్ల ఇచ్చి, అవే ఐదు కోట్లు తనకు సూర్య నుంచి వచ్చాయని మదన్గుప్తాకు చెబితే
కథ సమాస్తాం. కానీ కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి సీన్స్ మరికొన్ని ఉన్నాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్
సూర్య పాత్రలో సత్యదేవ్ సూపర్భ్‌గా నటించాడు. సీరియస్, యాక్షన్ ఈజ్, ఎమోషన్, లవ్ సీన్స్, బ్యాంకు దోపిడీ సీన్ ..ఇలా ప్రతి సీన్లో మెప్పించాడు. ఆదిత్యగా డాలీ ధనుంజయ ఒకే. సినిమాలోని యాక్షన్ సీన్స్ ఈ పాత్రకే ఉంటాయి. కానీ జరుగుతున్న కథకు ఇవి ఉపయోగపడవు. ఆదిత్య పాత్రబిల్డప్కు ఉపయోగపడతాయి. కానీ కథను నడిపించే కీలకమైన పాత్రలో ఉన్నంతలో డాలీ ధనంజయ యాక్టింగ్ ఫర్వాలేదు. స్వాతిగా ప్రియ భవానీశంకర్, సత్యదేవ్ ఫ్రెండ్ కమ్ బ్యాంకు ఉద్యోగిగా కమెడీయన్ సత్య బాగా చేశాడు. ఒకట్రెండ్ సీన్స్‌లో ఆడియన్స్‌ను నవ్విస్తాడు. మదన్ గుప్తాగా సునీల్ పాత్ర ఒకే. బ్యాంకు ఉద్యోగి పాత్రలో జెన్నిఫర్ ఉన్నంతలో చేశారు. ముఖ్యమంత్రిగా ‘కేజీఎఫ్’ గరుడ (రామచంద్ర), ఆది వైఫ్ ఆరాధ్యగా అమృత అయ్యర్ ఎక్స్టెండేట్ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారు. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు ఫ్లస్ కాలేదు. అలా అనీ మైనస్ కాలేదు. ఆది సీన్స్‌లో ఎడిటింగ్‌కు కాస్త స్కోప్ ఉంది. కెమెరా, నిర్మాణ విలువలు ఒకే.
చివరిగా…ఇంటెన్స్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చూసే ప్రేక్షకులకు జీబ్రా నచ్చవచ్చు. కానీ బ్యాంకు ఆపరేషన్స్‌పై అవగాహన లేని ఆడియన్స్‌కు కాస్త కష్టమే ఈ సినిమా. అలాగే లాజిక్‌లు పట్టించుకోకూడదు.