సినిమా: మెకానిక్ రాకీ
ప్రధానతారాగణం: విశ్వక్సేన్
దర్శకుడు: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేదీ: 2024 అక్టోబరు 31
సంగీతం: సామ్ సీఎస్
కెమెరా: మనోజ్ కటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిడివి: 2 గంటల 36 నిమిషాలు
రేటింగ్: 2.50
vishwakSen Mechanic Rocky Review: హైదరాబాద్‌లో ఆర్కే గ్యారేజ్ రన్ చేసే రామకృష్ణ (సీనియర్ నరేశ్) తనయుడు రాకీ (రాకేష్). కాలేజ్ డేస్ లో ప్రియ (మీనాక్షీ చౌదరి)ను ప్రేమిస్తాడు రాకీ. కొన్ని కారణావల వల్ల రాకీ, ప్రియ దూరం అవుతారు. కానీఓ సందర్భంలో డ్రైవింగ్ నేర్చుకునేందుకు రాకీ దగ్గరకు ప్రియ వస్తుంది. ఆ సమయంలో ప్రియ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను తెలుసుకుని ఆశ్చర్యపోతాడు రాకేష్. ఆ తర్వాత రాకీ జీవితంలోకి మాయ వస్తుం ది. అయితే మాయ లక్ష్యం రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కాదు. అలాగే మాయకు డ్రైవింగ్ నేర్పడం రాకీలక్ష్యం కాదు. మరి.. ఈ ఇద్దరు వెనకాల ఉన్న నిజమైన స్టోరీలు ఏమిటి? అప్సర (శ్రద్ధాశ్రీనాథ్) మాయగా ఎందుకు మారుతుంది? ప్రియ జీవితంలో జరిగిన చేదు సంఘటనలకు మాయకు ఉన్న సంబంధం ఏమి టి? అనేది మిగిలిన కథ (vishwakSen Mechanic Rocky Review)
ఆన్లైన్ మోసాలకు మధ్యతరగతి వాళ్లు ఎలా బలి అవుతున్నారు? అనే పాయింట్ ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రవితేజ. కాలేజీ డేస్‌లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం,ఆ తర్వాత హీరోయిన్ జీవితంలో ఏదో జరిగితే హీరో వెళ్లి సరిచేసి, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇవన్నీరోటీన్ కమర్షియల్ తెలుగు సినిమా ఫార్ములానే. ఇదే మెకానిక్ రాకీ సినిమాలోనూ ఉంటుంది. అదేఇది కొంతవరకు మాత్రమే. కథ పాతదే అయిన దర్శకుడు ఎంచుకున్న పాయింట్, కథ చెప్పిన విధానం ఆడియన్స్ ఆకట్టుకుటుంది. తొలిహాఫ్ సాదాసీదాగా సాగుతుంది. కానీ సెకండాఫ్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.
Suriya Kanguva Review: సూర్య కంగువ సినిమా రివ్యూ
కానీ ఓ మధ్యతరగతి ఇంట్లో ఓ వ్యక్తి ఇన్సురెన్స్ కడుతుంటే ఇది ఇంట్లో వాళ్లకు తెలియదు అనడం, హీరోకు ఆన్లైన్ దొంగల ముఠా దొరికినప్పుడు కూడా క్లైమాక్స్ వరకు వారిని పోలీసులకు పట్టించకుండ, వారికి తర చూ డబ్బులు ఇస్తుండటం వంటి సీన్స్ లాజిక్‌గా అనిపించవు. ఏదో కథను ముందుకు సాగించాలి కాబట్టిఅన్నట్లు ఉంటాయి. అలాగే సినిమా కాస్త ఇంట్రెస్టింగ్గా మొదలైన, వెంటనే రోటీన్ ఫార్మాట్లోకి వెళ్తుంది.ఇంట్రవెల్ కూడా గొప్పగా అనిపించదు. కానీ తన ట్రాప్ అంటూ హీరో చేసే సీన్స్ బాగుంటాయి. హర్షకామెడీ అప్పుడప్పుడు నవ్విస్తుంది.
మెకానిక్ రాకీ ఆలియాస్ రాకేష్‌గా విశ్వక్సేన్ (vishwakSen) ఎనర్జీ వెండితెరపై కనిపిస్తుంది. ఆడియన్స్‌కు నచ్చుతుంది. గ్యారేజ్‌లో ఫైట్, ఓ చేజింగ్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. ప్రియగా ఓ ఎమోషనల్ రోల్లోమీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) మెప్పిస్తుంది. ప్రియ క్యారెక్టరైజేషన్ కూడా చాలామంది మధ్యతరగతి అమ్మాయిలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇక విశ్వక్‌కు ఏమాత్రం తీసిపోని స్ట్రాంగ్ రోల్ మాయ ఆలియాస్ అప్సర పాత్రలోశ్రద్ధాశ్రీనాథ్ అదరగొట్టారు. ఈ సినిమాకు మెయిన్ పాత్ర శ్రద్ధాదే. వీకే నరేశ్ ఓ రోటీన్ తండ్రి పాత్ర చేశా రు. ‘వైవా’ హర్ష కామెడీ పార్టు చూసుకున్నాడు. నటరాజన్‌గా హర్హవర్థన్, చంటిగా రఘురామ్ పాత్రలు సెకండాఫ్‌కే పరిమితమైన, సినిమాలోకి కీలక పాత్రలు ఇవి. సీరియస్‌గా మొదలైన సునీల్ క్యారెక్టర్ కామెడీగా ముగుస్తుంది. ఉన్నంతోలో సునీల్ మెప్పించారు.నిర్మాణ విలువలు బాగున్నాయి. జేక్స్ బిజోయ్ సంగీతం మరో ప్రధాన బలం. ఆర్ఆర్ కూడా బాగుంటుంది.
చివరిగా …థియేటర్స్‌కు వెళితే మెకానిక్ రాకీ మెప్పిస్తాడు. పాత కథే అయిన..తీసుకున్న పాయింట్, చెప్పిన విధానం బాగుటుంది.