VarunTej Matka: వరుణ్‌తేజ్ (VarunTej )నెక్ట్స్ చిత్రానికి ‘మట్కా’ (Matka) టైటిల్‌ను ఖరారు చేశారు. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి నిర్మా తలు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 1958-1982 మధ్య కాలంలో దేశంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సిని మాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ కంప్లీట్‌గా కొత్తగా మేకోవర్ అవుతారు. వరుణ్ కెరీర్లో రూపొందుతున్న ఫస్ట్ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ కూడా ఇదే. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారు. వరుణ్కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతిత్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడు.
ఇతర చిత్రాలు
‘మట్కా’తో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నారు వరుణ్. ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే శక్తి ప్రతాస్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతూ, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్‌తేజ్. ఇందు లో మానుషీ చిల్లర్ హీరోయిన్. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. బాలీవుడ్లో వరుణ్‌కు తొలి చిత్రం కూడ ఇదే.