సినిమా: మట్కా (VarunTej Matka Review)
ప్రధానతారాగణం: వరుణ్‌తేజ్, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ, జాన్ విజయ్, కన్నడ కిశోర్, నవీన్‌చంద్ర
దర్శకులు: కరుణకుమార్
నిర్మాత: తీగల విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి
విడుదల తేదీ: 2024 నవంబరు 14
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
కెమెరా: కిశోర్‌కుమార్
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్
నిడివి: 2 గంటల 39 నిమిషాలు
రేటింగ్: 1.75/5
కథ
VarunTej Matka Review: బర్మా నుంచి వైజాగ్‌కు వచ్చిన శరణార్థి వాసు (వరుణ్‌తేజ్). చిన్నతనంలోనే ఓ హత్య కేసులో బాలనేరస్తుల జైలుకు వెళ్లాడు. శిక్ష పూర్తయిన తర్వాత వైజాగ్‌లోని పూర్ణమార్కెట్లో కొబ్బరికాయల వ్యాపారం చేసే అప్ప ల్ రెడ్డి (అజయ్‌ఘోష్) దుకాణంలో పని కుదుర్చుకుంటాడు వాసు. అప్పల్‌రెడ్డి కారణంగా వైజాగ్‌లో పేరు మోసిన అప్పటి రౌడీ కేబీ, అతని అనుచరుడు అమ్మోరుతో వాసు గొడవపడతాడు. ఈ గొడవల్లో వాసును నానిబాబు చేరదీస్తాడు. నానిబాబు అండతో వాసు పూర్ణమార్కెట్‌ను శాసించే స్థాయికి వెళతాడు.
జీవితంలో మరింత ఎదగాలని కొత్త వ్యాపారాలవైపు దృష్టిపెడతాడు వాసు. బట్టల దుకాణం స్టార్ట్ చేయా లని, ముడిసరుకు కోసం ముంబై వెళ్తాడు వాసు. అక్కడ ఏ గేమ్‌ను చూసి, ఆక్షర్షితుడు అవుతాడు. ఈ గేమ్ ను తన కొత్త ఆలోచనతో ముడిపెట్టి, ఈ గేమ్‌కు మట్కా అనే పేరు పెడతాడు. మట్కా గేమ్‌ను స్టార్ట్ చేసిన వాసు జీవితమే మారిపోతుంది. వైజాగ్‌లోనే కాదు..దేశవ్యాప్తంగా వాసు పేరు మారుమోగుతుంది. అయితే కేబీ, అమ్మోరు, నానిబాబుల కారణంగా వాసు జీవితం ఎలా తల్లకిందులైంది? వాసు మళ్లీ ఎలా పుంజుకున్నాడు? ప్రభుత్వం వాసును ఎందుకు టార్గెట్ చేసింది? వాసు వ్యక్తిగత జీవితం ఎలా సాగింది? అన్నదిమిగిలిన ‘మట్కా’ (VarunTej Matka Review) కథాంశం.
విశ్లేషణ
వైజాగ్‌కు ఎప్పట్నుంచో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎక్కువగా నాన్–లోకల్ వాళ్లే పవర్‌ఫుల్‌గా ఉంటుం టారు. అలా ఎక్కడో బర్మాలో ఉన్న వాసు, వైజాగ్‌కు వచ్చి, దేశం మొత్తం చర్చించుకునే ఓ వ్యవస్థగాఎలా మారాడు? అతని ప్రయాణం, ఎత్తుపల్లాలు, ఒడిదుడుకుల కథే ‘మట్కా’ చిత్రం. వాసు పడ్డఇబ్బందులు, లవ్‌ట్రాక్, ఎదిగే తీరు, మట్కాను స్టార్ట్ చేయడం వంటి ఇన్సిడెట్స్తో తొలిభాగంఉంటుంది. ఇంట్రవెల్ తర్వాత మట్కా వల్ల వాసు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఉంటుంది.
మట్కా సినిమా వాసు జర్నీ. అలా అని వాసు జీవితం మొత్తం సినిమాలో ఉండదు. 1958 నుంచి1982 అంటే..ఈ 24 ఏళ్ల టైమ్పీరియడ్లో వాసు జీవితంలో ఏం జరిగింది? అన్నదే ‘మట్కా’ సినిమా. వాసు చిన్నప్పటి సన్నివేశాలతో కథ మొదలువుంది. అప్పట్నుంచే సినిమా ఆసక్తికరంగాసాగదు. ముందు సన్నివేశాలు మనకు తెలిసినట్లుగానే అనిపిస్తుంటాయి. మట్కా గేమ్ స్ట్రక్చర్, వాసు కోసం సీబీఐ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్, స్టోరీని చెప్పే తీరు..ఏవీ కొత్తగా అనిపించవు. పైగా నరేషన్ తీరు బోరుగా అనిపిస్తుం టుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా చాలా సాదాసీదాగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో వరుణ్ చెప్పే ఓ కథ ఆడియన్స్ ఓర్పుకు ఓ పరీక్ష. ఇలా ‘మట్కా’ గేమ్ గాడి తప్పింది.
పబ్లిక్ డొమెన్లో ఉన్న విషయాలు, సంగతులపై సినిమాలు తీయడం కత్తిమీదసాము వంటి పని. కథ కోసం మనం ఎంత రీసెర్చ్ చేశాం, ప్రీప్రొడక్షన్ వర్క్స్‌ను ఎంత పక్కాగా ప్లాన్ చేశాం అనే దాని కన్నా…కూడా ఏ విధంగా ఆడియన్స్‌కు ఏంగేజింగ్గా చెప్పగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. మట్కా సినిమా విషయంలో కథకు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు కరుణకుమార్ ఈ సారి విఫలం అయ్యాడు.గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినో..ఇలా ఎన్నో కొత్త రకాల వ్యసనాలు మార్కెట్లో ఉన్నప్పుడు….పాత జూదం అయిన మట్కాను ఈ తరం ఆడియన్స్‌కు చెప్పేప్పుడు మరికొంత డ్రామా క్రియేట్ చేయాల్సింది.
VaruntejGhani: గని సినిమా అందుకు ఫ్లాప్; నిర్మాత సిద్దు ముద్దా
నటీనటులు పెర్ఫార్మెన్స్
వాసు పాత్రలో వరుణ్‌తేజ్ యాక్టింగ్ బాగానే ఉంది. నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో వరుణ్ చూపిన వ్య త్యాసం అతని కష్టాన్ని తెలిసేలా చేస్తుంది. కానీ సినిమాల పరంగా కష్టం ఒక్కటే హిట్‌ను మోసుకురా లేదు. వాసు భార్య సుజాతగా మీనాక్షీ చౌదరి, సుజాత అక్క పద్మగా సలోని, సోఫియాగా నోరాఫతేహీ వారి వారి పాత్రల మేరకు చేశారు. మీనాక్షీ డీ గ్లామరస్‌గా కనిపిస్తే, సిల్వర్‌స్క్రీన్ గ్లామర్ అద్దిన పాత్రలో నోరా ఫతేహీ కనిపిస్తారు. సీబీఐ ఆఫీసర్ సాహుగా నవీన్చంద్రది కీలక పాత్ర. కథను ముందుకు నడిపిం
చేది ఇతనిపాత్రే. విలన్స్ కేబీగా జాన్ విజయ్, నానిబాబుగా కన్నడ కిశోర్‌లు చేశారు. ముఖ్యంగా నానిబాబుగా కన్నడ కిశోర్‌కు మంచి స్క్రీన్ టైమ్ ఉన్న రోల్ లభించింది. అప్పల్రెడ్డిగా అజయ్ఘోస్కు ప్రాము ఖ్యత ఉన్న పాత్ర దక్కింది. సత్యం రాజేష్ పాత్ర ఉంది అన్నట్లు ఉంటుంది. హఠాత్తుగా మాయం అవుతుంది. నిర్మాణ విలువలు ఒకే. ‘తంగలాన్, అమరన్, లక్కీభాస్కర్’ వంటి సినిమాల మ్యాజికల్మ్యూజిక్ను ఈ సినిమాలో చూపించలేకపోయారు జీవీ ప్రకాష్‌కుమార్. కెమెరా వర్క్ ఒకే. ఎడిటింగ్
చేసుకోవచ్చు.
చివరిగా…ఈ సినిమాలో వరుణ్‌తేజ్ చేసే ఓ పెద్ద పని ముందు..ప్రామిస్, ప్రామిస్ అంటుంటారు. ప్రామిస్..మట్కా సినిమా గతుకుల రొడ్డుపై జట్కాబండి మీద పయనం చేస్తున్నట్లుగా ఉంటుందని చూసిన మెజారిటీ ఆడియన్స్ చెబుతున్న మాట.