ఫీమేల్ ఓరియెంటేడ్ జానర్లో వీలైనప్పుడల్లా నటిస్తూ, తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటుంటారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్. అయితే వరలక్ష్మీ నటించిన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శబరి’. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అనిల్ కాట్జ్ తెరకెక్కించగా, మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. 2024 మే 3న ఈ చిత్రం తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో విడుదలై, ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వ్యూయర్స్‌కు అందుబాటులోకి వచ్చింది.
కథ
చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన సంజన, ఆ తర్వాత అరవింద్ (గణేశ్ వెంకట్రామన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ సంజనను అరవింద్ మోసం చేస్తాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కుమార్తె చిన్నారి రియా (నివేక్ష)ను తీసుకుని ముంబై నుంచి వైజాగ్‌కు వచ్చేస్తుంది సంజన. ఈ క్రమంలో తన కాలేజీ ఫ్రెండ్ రాహుల్ (శశాంక్) ను కలుస్తుంది సంజన. రాహుల్ రిఫరెన్స్‌తో ఓ ఉద్యోగం కూడా సంపాదిస్తుంది. అలా లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తున్న సమయంలో సంజన జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. సైకో సూర్యం అనే వ్యక్తి రియా తన కుమార్తె అని, రియాను తనకు అప్పగించాలని సంజనను వేధిస్తుంటాడు. మరోవైపు రియాను తండ్రైన తన సంరక్షణలో ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తాడు అరవింద్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంజన ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అసలు..సైకో సూర్యంకు సంజనకు మధ్య ఉన్న లింక్ ఏమిటి? సంజన గతం ఆమె ప్రస్తుత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్న ఆసక్తికరమైన అంశాలను సన్‌నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వీక్షించి, ఆ థ్రిల్‌ను ఎక్స్‌పీరి యన్స్ చేయవచ్చు.
నటిగా వరలక్ష్మీశరత్‌కుమార్‌కు ఆడియన్స్ ఆల్రెడీ మెచ్చుకున్నారు. సో..యాక్టింగ్ పరంగా వరలక్ష్మీవరత్కుమార్ ఈ సినిమాలోనూ ఇరగదీశారని చెప్పవచ్చు. పైగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాబట్టి వరలక్ష్మీకి యాక్టింగ్ స్కోప్ మరింత లభించింది. ఇందుకు దర్శకుడు అనిల్ కాట్జ్ కథ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోడయ్యాయి. ఇలా ‘శబరి’ సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ప్రీ ఇంట్రవెల్ నుంచి సినిమా
కథనం పరిగెడుతుంది. సెకండాఫ్‌లో మరింత ఎంగేజింగ్‌గా ఉంటుంది. మైమ్ గోపీ, వరలక్ష్మీశరత్కుమార్ల మధ్య వచ్చే సన్నివేశాలుప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. సెకండాఫ్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగు తుంది. ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు సంగీతం, ఆర్ఆర్ చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండ సూపర్భ్ మ్యూజిక్ ఇచ్చారు. రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిల సినిమాటోగ్రఫీ పనితనం విజువల్స్‌లో కనిపిస్తుంది.
నటీనటులు
సంజన పాత్రలో వన్నాఫ్ ది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అన్నట్లుగా నటించారు వరలక్ష్మీశరత్‌కుమార్. సింగిల్ మదర్‌గా సంజన పాత్రలో ఆమె ఓదిగిపోయిన తీరు , సహాజ నటన ఆడియన్స్‌ను కట్టి పడేస్తుంది. శశాంక్ సపోర్టింగ్ యాక్టింగ్, విలన్‌గా మైమ్ గోపీ నటన మెప్పిస్తాయి. వెంకట్రామన్ కూడా ఉన్నంతలో బాగా చేశారు.
చివరిగా..
ఈ చిత్రం జానర్ పరంగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీయే కానీ…ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, కథనం సినిమాలో ఉన్నాయి. థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్లు సన్‌నెక్ట్స్ వేదికగా ‘శబరి’ సినిమాను చూడొ చ్చు.
Tollywoodhub.com Team Rating: 3/5