tollywood Villain: టాలీవుడ్లో తెలగు విలన్ పాత్రలు చేసేవారు తక్కువైపోయారు. ఇప్పటికే టాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌పై మెజారిటీ స్పేస్ బాలీవుడ్ హీరోయిన్స్దే. ఇప్పుడు విలన్ల స్పేస్‌నూ సైతం బాలీవుడ్ నటీనటులే ఆక్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది (tollywood Villain).
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే (హిందీ హీరోయిన్ల సంఖ్య ఎక్కువే)
చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’లో బాలీవుడ్ నటుడు కునాల్కపూర్ విలన్ రోల్ చేస్తున్నట్లుగా తెలు స్తోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారీ సినిమాను. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నారు. ‘వీరమాస్’ అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక నాగార్జున, ధనుష్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘కుబేర’ సినిమాలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ విలన్‌గా కనిపిస్తారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘దేవర’ సినిమాలో సైఫ్అలీఖాన్ ఓ విలన్‌గా కనిపిస్తారు. గతంలో ప్రభాస్ చేసిన ‘ఆదిపురుష్’లో సైఫ్ విలన్‌గా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లోని సినిమాలో సంజయ్‌దత్ నెగటివ్ రోల్ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ రామ్ ‘ఇస్మార్ట్‌శంకర్’ సీక్వెల్ ‘డబుల్ఇస్మార్ట్’లో సంజయ్‌దత్ విలన్ రోల్ చేస్తున్నారు.
tollywood:ప్రీ ప్రొడక్షన్స్‌లోనే ఫ్లాప్!
అడివి శేష్ హిట్ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రానున్న ‘గూఢచారి 2’లో ఇమ్రాన్హష్మి విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే పవన్‌కల్యాణ్ ఓజీ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మియే విలన్. పవన్‌కల్యాణ్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘హరిహరవీరమల్లు’లో బాబీడియోల్ లేదా అర్జున్రాంపాల్లు విలన్స్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
TollywoodHero: బాలీవుడ్ డెబ్యూ..అట్టర్ ఫ్లాప్!
ఇలా దాదాపు డజను ప్రామినెంట్ ఫిల్మ్స్‌లో హిందీ నటులే మెయిన్ విలన్ రోల్స్ చేస్తున్నారు. పోనీ..హిందీ మార్కెట్ కోసమా అంటే…ఇప్పుడు పాన్ ఇండియాగా మొదలై, ఆ తర్వాత తెలుగులోనే విడుదలైయ్యే టాలీ వుడ్ సినిమాలే ఎక్కువ. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ వెర్షన్స్ ఓటీటీలో అందుబాటులో ఉంటు న్నాయి కానీ థియేటర్స్‌లో విడుదల కావడం లేదు.