kalki2898ad Story: సినీ ప్రపంచంలో సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి2898ఏడీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు వారం రోజుల ముందే నార్త్ అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్‌ను బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ‘కల్కి2898ఏడీ’ నిలిచింది. అంతేకాదు. .ఇండియాలోనూ, ఓవర్సీ స్లోనూ ‘కల్కి2898ఏడీ’ సినిమా ఆన్లైన్మూవీ పోర్టల్స్‌లో లభిస్తున్న బుకింగ్స్ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆడియన్స్ ఈ సినిమా పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో స్పష్టం చేస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీబడ్జెట్తో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది (kalki2898ad Story)
Kalki2898adtrailer:కల్కి2898ఏడీ ట్రైలర్ అదిరిపోయింది
‘కల్కి2898ఏడీ’ సినిమా విడుదల సమీపిస్తున్న తరుణంలో ఈ సినిమా కథపై పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఓ కథ ఏంటంటే….
కాశీ వర్సెస్ కాంప్లెక్స్?
ఆరువేల సంవత్సరాల టైమ్‌లైన్ పీరియడ్‌తో ‘కల్కి2898ఏడీ’ సినిమా ప్రధానంగా కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఉంటుంది. కాంప్లెక్స్‌లో సుప్రీమ్ యాక్సిన్ (కమల్ హాసన్) ఓ నియంతగా, దేవుడిగా చాలామణి అవు తుంటాడు. భూతల స్వర్గంలా ఇక్కడి ప్రదేశాలు, అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. కాంప్లెక్స్ ప్రపం చంలోకి వెళ్లాలంటే కాశీలో నివాసం ఉండేవారు చాలామొత్తంలో యూనిట్స్(డబ్బు)ను చెల్లించాలి. కాశీలోఉన్న సమస్యల దృష్ట్యా కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని యూనిట్స్ కోసం కొందరు కష్టపడుతుంటారు. యూనిట్స్ లేనివారు ఎలాగైన వెళ్లాలని వివిధ దారులు వెతుకుతుంటారట.
ఈ క్రమంలో భైరవ( ప్రభాస్) చేసే సాహసాలు, భైరవతో బుజ్జి(భైవర వాహనం పేరు బుజ్జి..కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్) బాండింగ్, రంజన్(బ్రహ్మానందం)తో వచ్చే కామెడీ సన్నివేశాలు అలరిస్తాయట. అలాగే కాంప్లెక్స్‌తో ఉండేవారితో భైరవవైరుధ్యాలు, ఫైట్స్ కూడా అద్భుతంగా ఉంటాయట. ప్రగ్నెంట్ లేడీ సుమతి(దీపికా పదుకొనె)తో భైరవకు ఎలాంటి బాడింగ్ ఉంటుంది? ఆమెపై ఎవరైనా ప్రయోగాలు చేస్తారా? అనే అంశాలు ఈ సినిమాలో కీలకమైన ఆసక్తికరమైన పాయింట్స్‌గా ఉంటుందట. అలాగే మరియమ్‌గా మలయాళ నటి శోభన, మృణాల్‌ఠాకూర్, రాజేంద్రప్రసాద్, దర్శకుడు రాజమౌళి ల పాత్రలు ‘కల్కి2898ఏడీ’లో ఏ విధంగా ఉండబోతున్నాయి? అనే ఆసక్తి కూడా సీనీ లవర్స్‌లో ఉంది.
షంబాల ప్రపంచం..
మరోవైపు షంబాల ప్రపంచంలో అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్) వంటి వారు ఉంటారు. కథలో ఉన్న మైథలాజికల్ అంశాలన్నీ షంబాలతో ముడిపడిఉంటాయి. ఈ ప్రపంచంలో కైరా (మలయాళ నటి అన్నాబెన్), వీరన్ (పశుపతి)ల పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని తెలిసింది. ఓ దశలో కథ పరంగా కాశీవాసులకు, కాంప్లెక్స్ నివాసులకు వచ్చే పోరులో షాంబాల వారు భైరవకు సాయ పడతారట. ఎందుకు అనేది సినిమాలో చూడాల్సిందే.
Ramayana: హిందీ రామాయణ ఆగిపోయినట్లేనా?
అలాగే ద్వాపరయుగం అంటే…శ్రీకృష్ణ భగవానుడు మరణించారని చెప్పుకునే 3012బీసీ సమయం నుంచి ‘2898ఏడీ టైమ్‌లైన్ అంటే 6వేల సంవత్సరాల టైమ్‌లైన్ పీరియడ్‌లో ఈ సినిమా కథ ఉంటుందని ఈ చిత్రం దర్శకుడు నాగ్అశ్విన్ ఓ సందర్భంగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
tollywood Villain: తెలుగు సినిమా విలన్ కేరాఫ్ ముంబై!
వివిధ భాగాలుగా…
‘కల్కి2898ఏడీ’ సినిమా రెండు అంతకుమించిన భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27న అంటే జూన్న విడుదల అయ్యేది ‘కల్కి సినిమాటిక్ యూనీవర్స్’లోని తొలిభాగం మాత్రమే. ‘కల్కి 2898ఏడీ’ సినిమా తొలిపార్టు విజయంపై రెండోభాగం ఎప్పుడు, ఎలా విడుదల అవుతుంది అనే పరిణామాలు ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది.
చాలామంది స్టార్స్
TollywoodHero: బాలీవుడ్ డెబ్యూ..అట్టర్ ఫ్లాప్!
‘కల్కి2898ఏడీ’ సినిమాలో దుల్కర్సల్మాన్, విజయ్‌దేవరకొండ, మృణాల్‌ఠాకూర్ వంటి నటీనటులు చాలామంది ఉన్నారట. కానీ వీరి పాత్రలు ఈ నెల 27న విడుదల అయ్యే ‘కల్కి2898ఏడీ’ తొలిభాగంలోనే ఉంటాయా? లేక రెండోపార్టు కోసం…మొదటి పార్టు క్లైమాక్స్‌లో వచ్చే క్లిఫ్ హ్యాంగర్స్ వీడియోస్ లో కనిపిస్తారా? అనేది చూడాలి.