AlluArjun Pushpa2TheRule Story: పుష్ప ది రూల్ సినిమాపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాట్నాలో జరిగినప్పుడు అక్కడ రెండులక్షల మందికిపైగా ఆడియన్స్ హాజరైయ్యారంటే జనాల్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అయితే ‘పుష్ప 2’ ట్రైలర్ విడుదలైనప్పటీ నుంచి ‘పుష్ప2’ కథపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు సోషల్‌మీడియాలో వివిధరకాలపై ఉహాగానాలు,కాల్పనిక కథలు తెరపైకి వచ్చాయి.
‘పుష్ప’ పార్టు 1 క్లైమాక్స్‌లో పుష్పరాజ్ (అల్లు అర్జున్)కు, పోలీస్ ఆఫీసర్ బన్వర్సింగ్షెకావత్ (ఫాహద్ ఫాజిల్)కు మధ్య వార్ అన్నట్లుగా ముగుస్తుంది. దీంతో ‘పుష్ప’ సెకండ్ పార్టు ‘పుష్ప2: ది రూల్’ సినిమా సినిమా కథ అంతా పుష్పరాజ్ వర్సెస్ బన్వర్సింగ్ షెకావత్‌ల మధ్య ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఫాహద్‌ఫాజిల్ పాత్రలో అంత బలం లేదనిపిస్తోంది.
కథ అంతా..ఎర్రచందనం సిండికేట్ రాజకీయాలు, పుష్పరాజ్ వ్యక్తిగత జీవితం, పుష్ప అన్న మోహన్‌రాజ్ (అజయ్) జాతర్లో స్కేచ్ వేయడం, ఇంట్రెవల్లో జాతర ఫైట్, ఇంటర్నేషన్ డీల్, హవాలా మనీ, పుష్ప రాజ్ చనిపోయినట్లుగా ఓ ఫేక్ ఎపిసోడ్, తిరిగి వచ్చి తన చేస్తున్న అక్రమాలు మంచికే అన్నట్లు ఓ కన్‌క్లూజన్…ఇలా కథ ఉంటుం దన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే..అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7, 2023న ‘పుష్ప2: ది రూల్’ సినిమా నుంచి ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఓ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో రిఫరెన్స్ ఇక్కడ ఏం లేదు. అలాగే పుష్పరాజ్ ఏదో మంచి చేస్తున్నట్లుగా చూపించారు. ఇది కొత్తగా విడుదలైన ట్రైలర్లో లేదు. అలాగే జగపతిబాబు క్యారెక్టర్‌ను ట్రైలర్లో వాయిస్కే పరిమితం చేశారు. అనసూయ, సునీల్, ధనుంజయపాత్రలను ఏ మాత్రం టచ్ చేయలేదు.
ఇప్పటికే పుష్ప ది రూల్ సినిమాకు 420 కోట్ల నాన్–థియేట్రికల్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ వసూళ్లపై అంచనాలు నెలకొన్నాయి. మైత్రీమూవీ మేక ర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్లు నిర్మిస్తున్న ‘పుష్ప ది రూల్’ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.