బుజ్జమ్మగా గుర్తిండిపోతాను
Ananya Nagalla: ‘పొట్టేల్’ (Pottel) సినిమాలో నేను బుజ్జమ్మ పాత్రలో నటించాను. ఓ తల్లి పాత్ర చేశాను. ట్రైలర్లో నా క్యారెక్టర్‌కు పెద్ద స్పేస్ లేదు. కానీ సినిమాలో మంచి స్ట్రాంగ్ రోల్ నాది. సాహిత్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు…ఆల్రెడీ నేను ఓ వెబ్‌సిరీస్‌లో అమ్మ పాత్రలో చేస్తున్నాను. మళ్లీ ఇప్పుడు ‘పొట్టేల్’ సినిమాలో అదే పాత్రఎందుకు అని ఆలోచించాను. కానీ దర్శకుడు ఎప్పుడైతే…‘పొట్టేల్’ సినిమా చదువును గురించి అనిచెప్పారో అప్పుడే ఈ సినిమాకు కనెక్ట్ అయ్యాను. ఓ చిన్న పాప చదువుకోవడం కోసం ఎంత కష్టపడుతుందో ఈ సినిమాలో చూస్తారు. 1980 నేపథ్యంతో సాగే కథ ఇది. బుజ్జమ్మ పాత్రలో ఆడియన్స్ నన్నుగుర్తు పెట్టుకుంటారు.
ట్రైలర్లో అజయ్‌గారు నన్ను కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. చెప్పాలంటే…ఆ సీన్‌నే ఈ సినిమాలో తొలిసారి తీశారు. నా ఫస్ట్ డే షాట్ అదే. ఏ ఇబ్బంది లేకుండ ఆ సీన్ చేశాను. అజయ్‌గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నటులు. నటిగా నా తొలి సినిమా ‘మల్లేశం’లో అమ్మ పాత్ర చేశాను. ఆ పాత్రలో నన్ను చూసిన వాళ్లు, అందరు ఇప్పుడు నాకు అదే తరహా పాత్రలను ఆఫర్ చేస్తున్నారు. కానీ నాకైతే మంచి కొన్ని లవ్‌స్టోరీ సినిమాలు కూడా చేయాలని ఉంది.
ఇండస్ట్రీకి రాకముందు కార్పారేట్ కంపెనీలో పని చేశాను. ఆ కంపెనీలోనే ‘పొట్టెల్’ సినిమాలో హీరోగా చేసిన యువ చంద్ర వర్క్ చేశారు. ఆ సమయంలో వారు షాట్ఫిల్మ్స్ చేసేవారు. వాటిని చూసి నేను,అలా చేయాలి అని ఇన్స్ఫైర్ అయ్యాను. ఇప్పుడు యువతోనే సినిమా చేయడం సంతోషంగా ఉంది.
Ananya Nagalla: సుధీర్ఘకాలం ఉంటున్నుందకు సంతోషంగా ఉంది!
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. నాకు ఎప్పుడూ పని దొరుకుతూనే ఉంది. ఇషా రెబ్బా వం టి తెలుగు అమ్మాయిలు తెలుగు చిత్రపరిశ్రమలో సుధీర్ఘంగా సినిమాలు చేస్తున్నారు. కొంతమంది ఇతర ఇండస్ట్రీ హీరోయిన్స్ తెలుగు చిత్ర పరిశ్రకు వచ్చి, టాప్ లీగ్‌లో ఉంటున్నారు. నాలుగైదేళ్ల తర్వాత వెళ్లిపోతున్నారు. తెలుగు అమ్మాయిగా నాకు ఇండస్ట్రీలో పని దొరుకుతుందన్నందుకు సంతోషంగా ఉంది. కాక పోతే…ఇతర ఇండస్ట్రీలో వాళ్ల అమ్మాయిలు హీరోయిన్స్‌గా 80శాతం ఉంటారు. ఇతరులు 20 శాతం ఉంటారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం 80 శాతం ఇతర హీరోయిన్స్, 20 శాతం మాత్రమే తెలుగుహీరోయిన్స్ ఉంటున్నారు.
టాప్ జోన్ కోసం పోటీ పడడం లేదు
నా కెరీర్లో ఓ కమర్షిలయ్ సక్సెస్ లేదు. పవన్‌కళ్యాణ్‌గారి ‘వకీల్‌సాబ్’ హిట్టైంది. కానీ ఆ సినిమా కోవిడ్ సమయంలో విడుదలైంది. నేను ఓ పాత్రగా చేశాను. ఒకవేళ నా కెరీర్లో కూడ ఓ మంచి కమర్షియల్ సక్సెస్ ఫిల్మ్ ఉంటే బాగుండేంది. ఇండస్ట్రీలో నేను ఏ హీరోయిన్‌తో పోటీ పడాలనుకోవడం లేదు. నేను ఇంకా ఆ పోటీ జోన్లోకి వెళ్లలేదు అనుకుంటున్నాను. నా పని నేను చేస్తున్నాను.
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే
నో కాదు..అలా అని ఎస్ కూడా కాదు!
తెలుగు అమ్మాయిగా హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు మా ఫ్యామిలీ ఫుల్‌గా ఏం సపోర్ట్ చేయలేదు. అలా అని వద్దు అని చెప్పలేదు. నా పని నేను చేస్తున్నాను. జాగ్రత్తలు మాత్రం చెబుతున్నారు. కానీ పొట్టేల్ సినిమా పట్ట మా అమ్మగారు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ పోట్టెల్ సినిమా తర్వాత మా అమ్మ గర్వపడతారు.
ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాన్రా అనుకున్నాను!
ఉద్యోగం వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. కోవిడ్ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో..అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? అనిపించింది. కాస్త పశ్చాత్తాపం చెందాను. కానీ ఇప్పుడు అంతా బాగుంది. ప్రస్తుతం మరో నాలుగు సినిమాలు చేస్తున్నాను.