తమిళ హీరో విజయ్ (Thalapathy Vijay) తర్వాతి చిత్రం ఫిక్స్ అయ్యింది. గ్యాంబ్లర్, మనాడు రీసెంట్గా కస్టడీ చిత్రాలను తీసిన దర్శకుడు వెంకట్ ప్రభు దర్వకత్వంలో విజయ్ హీరో సినిమా ఖరారైపోయింది. విజయ్ కెరీర్లో ఇది 68వ సినిమా. విజయ్ ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థయే ఈసినిమానూ నిర్మిస్తోంది. నిర్మాణసంస్థకు ఇది 25వ చిత్రం కావడం విశేషం.
విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.త్రిష హీరోయిన్గా సంజయ్‌దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబరు 19న థియేటర్స్‌లో విడు దల కానుంది.