తెలుగు హీరో, తమిళ దర్శకుడు కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అని మీడియాలో తెగ ప్రచారం సాగింది. ఉదాహారణలుగా నాగచైతన్య–వెంకట్ప్రభుల ‘కస్టడీ’, రామ్–లింగుసామీల ‘ది వారియర్’,సందీప్‌కిషన్– రంజిత్ జయకోడిల ‘మైఖేల్’లను ఉదాహారణగా చెప్పుకొచ్చారు. పనిలో పనిగా గతంలో వచ్చిన మహేశ్‌బాబు– మురుగదాస్‌ల ‘స్పైడర్’, పవన్‌కళ్యాణ్–ఎస్జే సూర్యల ‘పులి’ చిత్రాలనుకూడా లాక్కొచ్చారు.
అదేవిధంగా ప్రజెంట్ రామ్‌చరణ్‌తో తమిళ దర్శకుడు శంకర్ ‘గేమ్‌చేంజర్’, సాయిధరమ్‌తేజ్, పవన్ కళ్యాణ్ హీరోలుగా తమిళ దర్శకుడు సముద్రఖని తీస్తున్న ‘బ్రో: ది అవతార్’ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయనే ఊహాగానాలును కొందరు ఔత్సాహికులు విశ్లేషించారు.
ఈ విషయాలను గురించి పక్కన పెడితే…తెలుగు దర్శకులు (Tollywood Directors) హిందీలో తీసిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. తెలుగులో జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి హిందీలో ఇదే సినిమాను సేమ్ టైటిల్‌తో రీమేక్ చేస్తే డిజాస్టర్. తెలుగులో హిట్ ఫిల్మ్ ‘హిట్’ సినిమాను సేమ్ డైరెక్టర్, సేమ్ టైటిల్‌తో రీమేక్ చేస్తే చూసినవారు లేరు. రీసెంట్గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను హీరోగా పెట్టి వీవీ వినాయక్ ‘ఛత్రపతి’ని సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తే అక్కడ అది డబుల్ డిజాస్టర్.. ఈ కోవలో చెప్పుకుంటే మరికొన్ని సినిమాలు ఉన్నాయి.