‘ఉగ్రం’ నా కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ: దేవేరి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్
‘నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. అల్లరి నరేష్ ని ఫెరోషియస్ పోలీస్ గా చూపించిన ఉగ్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. విన్న వెంటనే మనసుకు ఎంతగానో నచ్చేసే పాటిది. ట్యూన్, లిరిక్స్, కంపోజిషన్ మనసుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల మెలోడి, రొమాంటిక్ నెంబర్ ని అందించారు. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకోగా అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ మరింత మాధుర్యాని తెచ్చాయి. అల్లరి నరేష్, మిర్నాల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ పాట లీడ్ పెయిర్ ఒకరికొకరు ఉన్న అనురాగాన్ని ప్రజంట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=4gY1RK8Gs1k సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా ఆస్కార్…