SuriyaKanguva: సూర్య (Suriya) యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ కంగువా (Kanguva). శివ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ఈ సిని మా విడుదల కానుంది. తొలిభాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పటికీ రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత లేదు. కానీ ఈ సినిమా కథను గురించిన ప్రచారాలు మాత్రం తెరపైకి వచ్చాయి.
ప్రచారంలో ఉన్న కథ!
17వ శతాబ్ధంలో ఓ వింత వ్యాధి కారణంగా తాను చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోకుండానే కంగువా అనే యోధుడు చనిపోతాడట. అతను తిరిగి మళ్లీ 21వ శతాబ్ధంలో జన్మిస్తాడు. మరోవైపు 17వ శతాబ్ధంలో కంగువ ఏ వ్యాధితో చనిపోయాడో ప్రపంచానికి చెప్పేందుకు ఓ యువతి 21వ శతాబ్ధంలో పరిశోధనలుచేస్తుంటుంది. ఈ క్రమంలోనే కంగువ మళ్లీ జన్మించాడని తెలుసుకుంటుంది.
ఆపై కంగువకు తన గతజన్మను గుర్తు చేయడం, కంగువ తాను పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకోవడం, ఇందుకువిలన్ అడ్డుపడటం అనే అంశాల నేపథ్యంలో 5 వేల సంవత్సరాల టైమ్‌లైన్‌తో సాగే చిత్రంగా ‘కంగువా’ఉండబోతోందని కోలీవుడ్ సమాచారం. హీరోగా సూర్య, విలన్‌గా బాబీ డియోల్, హీరోయిన్గా దిశాప టానీ, ఓ కీలక పాత్రలో యోగిబాబు కనిపిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సెవెన్త్ సెన్స్ కథలా ఉన్నట్లుందే..
‘కంగువా’ సినిమా కథ ప్రచారంలోకి రాగానే సూర్య హీరోగా నటించిన గత చిత్రం ‘సెవెన్త్ సెన్స్’ను తెరపైకి తెస్తున్నారు కొందరు నెటిజన్లు.
వైద్యం, ఆయుర్వేదం పట్ల అపారమైన జ్ఞానం ఉన్న బోధిధర్ముడు 13వ శతాబ్దంలో చనిపోతాడు. అతని మూలాలు ఉన్న వ్యక్తి మళ్లీ 21వ శతాబ్ధంలో జన్మిస్తాడు. హీరోయిన్ అతన్ని కనిపెట్టి, భారతదేశంపై జరగబోయే బయోవార్ కుట్రను అడ్డుకుంటుంది….క్లుప్తంగా సెవెన్త్ సెన్స్ సినిమా కథ ఇది. ఈ కథ దగ్గర దగ్గరగా ‘కంగువా’ సినిమా కథను తలపిస్తోందని కొందరు చెబుతున్నారు. ఇలా తీసిన సినిమానే మళ్లీ సూర్య ఎందుకు తీస్తున్నాడా? అని ఆయన ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారట.
మరోవైపు ‘కంగువా’ నుంచి ఇప్పటివరకు వచ్చిన విజువల్స్, టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్ అయితే అద్భు తంగా ఉన్నాయి. మరి..‘కంగువా’కథకు, సూర్య ‘సెవెన్త్ సెన్స్’ సినిమాకు ఏదైనా లింక్ ఉం టుందా? లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం కార్తిక్సుబ్బరాజు దర్శకత్వంలోని సినిమాతో సూర్య బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో జరుగుతోంది. సూర్య, పూజాహెడ్డే, జయరాం వంటి
ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలను కుంటున్నారట మేకర్స్.