Suriya Kanguva Review:
ప్రధానతారాగణం: సూర్య, దిశాపటానీ, బాబీ డియోల్, యోగిబాబు
దర్శకులు: శివ
నిర్మాత: కేజీ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
విడుదల తేదీ: 2024 నవంబరు 14
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కెమెరా: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: నిషాద్ యూసుఫ్
నిడివి: 2 గంటల 34 నిమిషాలు
రేటింగ్: 2/5
కథ
11వ శతాబ్ధం. పంచమద్వీపం (ప్రణవాది, కపాలదీవి, హిమకోన, అరణ్య కోన, సాగరకోన)పై పట్టు సాధించేందుకు రోమేనియా సైన్యాలు దాడికి ప్లాన్ చేస్తాయి. ఈ క్రమంలో ముందుగా ప్రణవాదినిఅదుపులోకి తెచ్చుకోవాలని అనుకుంటారు. బంగారానికి ఆశపడి, ప్రణవాదికి అన్యాయం చేసేందుకు
రెడీ అవుతాడు సాగరకోన వాసి క్రోదుడు. ఇందుకు ఓ వ్యూహం రచిస్తాడు. కానీ ఈ వ్యూహాన్ని కనిపెట్టినకంగువా..అతన్ని సజీవ దహనం చేస్తాడు. క్రోదుడు భార్య కూడా ఆ మంటల్లోనే ఆత్మాహుతి చేసుకుంటుం ది. కానీ క్రోదుడు కుమారుడి బాధ్యత కంగువ తీసుకుంటాడు. ఇది ప్రణవాది వాసులకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఫలితంగా కంగువ ప్రణవాదిని వదలివెళ్లి, చీకటికోనకు వెళ్లాల్సి ఉంటుంది.
మరోవైపు…క్రోదుడు చనిపోవడంతో కపాలదీవి నాయకుడు ఉధిరన్ను సాయం కోరతాడు రోమోనియా సైన్యాధ్యక్షుడు. ఇందుకు ఉధిరన్ అంగీకరిస్తాడు. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది. ప్రణవాది, కపాలదీవి, హిమకోన, అరణ్య కోన, సాగరకోన…ఈ ఐదుకోనల మధ్య అంత్యర్ధుద్దం ఎలా సాగింది? క్రోదుడి కుమారుడు పల్లవను కంగువ కాపాడగలిగాడా? అసలు…11వ శతాబ్ధంలో కంగువకు, 2024లోని ఫ్రాన్సిన్కు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగిలిన కథనం.
విశ్లేషణ
సినిమా నాన్–లీనియర్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. 11వ శతాబ్ధంలోని ఓ చిన్న సీన్‌తో మొదలైన కంగువ, 2024కి షిఫ్ట్ అవుతుంది. షాడో కాప్స్గా సూర్య, ఏంజెలినా దిశా పటానీ ఎక్స్ లవర్స్ సీన్స్‌తో సినిమా మొదలువుతుంది. ఈ సీన్స్ ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తాయి. మెల్లిగా కథ 11వ శతాబ్ధంలోకి వెళ్తుంది. స్టార్టింగ్ బాగానే..మెల్లిగా కథ గాడి తప్పుతుంది.
సినిమాలోని పాత్రలన్నీ ఊరికే పెద్ద పెద్దగా గోల చేయడం, అరుస్తుండటం కనిపిస్తుంటుంది. ఈ గోల తోడు దేవి శ్రీ మ్యూజిక్ ఆడియన్స్‌కు చెవిపోటు తెప్పించేలా ఉంటుంది. ఒకట్రెండు సన్నివేశాల్లోనే దేవి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కంగువ ఎంట్రీ సీన్, కంగవ–పల్లవుడు మధ్య వచ్చే సన్నివేశాలు ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్ ఫర్వాలేదు. ఇంట్రవెల్లో సింహాద్రి, ఇంట్రవెల్ తర్వాత బింబిసార సినిమాలు ఆడియన్స్
కు గుర్తుకు రావొచ్చు.
కథ ప్రకారం ఐదుకోనలు…ఉన్న కథనం అంతా ప్రణవాది, కపాల దీవిల మధ్యే ఉంటుంది. మిగతా కోనలు ఈ సినిమాలో పసికూనలు. పోరు అంతా ప్రణవాది, కపాల దివిల మధ్య అయినప్పుడు మిగితా కోనలనుప్రస్తావించాల్సిన అసరమే లేదు. పైగా పడవులు చేసుకునే సాగరకోన వాసులు, వీరులైన వందమంది ప్రణ వాది వాసులను చంపడం కన్విన్సింగ్‌గా ఉండదు.
యుద్ధానికి ముందు ఐదుకోన నాయకులు న్యాయపీఠం దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటాయి. అలాంటిది వీరులైన వందమంది ప్రణవాది వాసులు చనిపోయినప్పుడు ఈ న్యాయపీఠం ప్రస్తావన ఎందుకు ఉండదోఅర్థం కాదు. ప్రణవాదికి, కపాలదీవికి పాత వైరం అంటారు. అసలు..ఈ కోనల మధ్య ఉన్న పాత వైరం ఎందుకు మొదలైంతో చెప్పరు. క్లైమాక్స్‌లో రోమేనియా సైన్యాలు మాయమైపోతాయి. 2024లో ఓ ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల లక్ష్యం ఏంటో క్లారిటీ ఉండదు. ఈ సీన్స్అన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మైనస్‌లు. క్లైమాక్స్‌లో కార్తి గెస్ట్ అప్పీరియన్స్ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో మహిళల ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది.
నటీనటులు
సూర్య యాక్టింగ్ బాగుంటుంది. ముఖ్యంగా యాక్షన్, వీలైనప్పుడు ఎమోషనల్ సీన్స్‌లో తనదైన శైలి యాక్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా కుంగవగా సూర్య ఎంట్రీ సీన్ బాగుంటుంది. కానీ ఫ్రాన్సిన్గా సూర్యనటన సో సోగానే ఉంటుంది. ఇక దిశా పటానీ రోల్ హీరోయిన్గా ఏమీ లేదు. పీరియడ్ పోర్షన్స్‌లో సూర్యకు పెయిర్ లేరు. యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ ల కామెడీ నవ్వించదు. మన్సూర్ అలీఖాన్, కోవైసరల, రవి రాఘవేంద్ర, నటరాజన్ వారి వారి పాత్రల మేరకు నటంచారు. కపాల కోన అధినేత ఉధిరన్‌గా బాడీ డియోల్ స్క్రీన్‌పై ఉన్నంతలో మెప్పించారు.
విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కానీ సినిమాను 2డీలో చూస్తే బెటర్. 3డీ వెర్షన్ వెల్యూస్ మెప్పించకపోవచ్చు. దేవి మ్యూజిక్, సాంగ్స్ వర్కౌట్ కాలేదు. ఎండిటింగ్ పని ఉంది. దర్శకుడు శివ…11వ శతాబ్దాన్ని, 2024ని బ్లెండ్ చేసిన విధానం బాగుంది. కానీ కథలో బలం లేదు.
చివరిగా…సూర్య కోసం, యాక్షన్ సీక్వెన్స్‌లో కోసం సినిమా చూడొచ్చు. లేకపోతే ఆడియన్స్ థియేటర్స్‌లో కంగుతిని, కుంగిపోతారు.