Sivakarthikeyan Telugu Amaran: తమిళ పాపులర్ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. శివకార్తికేయన్ హీరోగా చేసిన ‘రెమో, డాక్టర్ వరుణ్, డాన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, హిట్స్‌గా నిలిచాయి. కానీ శివ కార్తికేయన్ డైరెక్ట్‌గా తెలుగులో చేసిన ‘ప్రిన్స్’ మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.
తాజాగా శివకార్తికేయన్ నటించిన మరో సినిమా ‘అమరన్’ తెలుగులో రిలీజ్ అయ్యెందుకు రెడీ అవు తోంది. అమరవీరుడు ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ‘అమరన్’ సినిమా తీశారు. ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి నటించగా, కమల్‌హాసన్ నిర్మించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. వరదరాజన్‌గా శివకార్తికేయన్ కని పిస్తారు. దీపావళికి ‘అమరన్’ విడుదల అవుతుంది (Sivakarthikeyan Telugu Amaran)
తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా 2024 అక్టోబరు 31న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘నువ్వు నాకు ఒక్కగాని ఒక్క అబ్బాయివి రా..ఆర్మీకి వెళ్తానంటావే’, ‘ఆర్మీ నాకు జాబ్ కాదు..లైఫ్’, ‘ఒక దేశ సైనికుడు..మరో దేశానికి టెరరిస్ట్’ అన్న డైలాగ్స్ ఉన్నాయి ట్రైలర్లో. తెలుగులో ఈ సినిమాను నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్‌రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.