సినిమా: అమరన్ (Sivakarthikeyan Amaran Review)
ప్రధానతారాగణం: శివకార్తికేయన్, సాయిపల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా
దర్శకులు: రాజ్‌కుమార్ పెరియసామీ
నిర్మాణం: కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణానీ
విడుదల తేదీ: 2024 అక్టోబరు 31
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
కెమెరా: సీహెచ్ సాయి
ఎడిటింగ్: కలైవణమ్
నిడివి: 2 గంటల 49 నిమిషాలు
రేటింగ్: 3/5
ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ముకుంద్ వరదరాజన్ ఆశయం. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎగ్జామ్ క్లియర్ చేసి, ట్రైనింగ్ పూర్తి చేసి, 44 రాష్ట్రీయ రైఫిల్స్ రాజ్‌పుత్ సింగ్మెంట్లో జాయిన్ అవుతాడు ముకుంద్. మరోవైపు ఇందు రెబకా వర్గీత్తో ప్రేమలో ఉంటాడు. కానీ ఆర్మీ వ్యక్తికి తన కూతుర్ని ఇవ్వనని ఇందు తండ్రి జార్జ్ పట్టుపడతాడు. కానీ ఇటు వైపు ఇందు, మరోవైపు ముంకుంద్లు జార్జీని కన్విన్స్ చేసి, వివాహం చేసుకుంటారు. ఓ పాపకు జన్మనిస్తుంది ఇందు.
మరోవైపు తన ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో మేజర్‌గా ప్రమోషన్ పొంది సౌత్ కశ్మీర్‌కు వెళ్తాడు ముకుంద్. ఉగ్రవాద సంస్థగా చెప్పుకునే జైషీ మహమ్మద్ కార్యకలపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అఫ్తాబ్ అలీని ఆపరేషన్ ఆఫ్తాబ్ పేరుతో చంపేస్తాడు ముకుంద్. దీంతో ముకుంద్ అండ్ టీమ్‌పై జైషీ సభ్యులు పగ తీర్చుకోవాలనుకుంటారు. జైషీ మహహ్మద్ కొత్త కమాండర్‌గా అసిఫ్ వానీ చార్జ్ తీసు కుంటాడు. వెంటనే ముకుంద్‌ను టార్గెట్ చేస్తాడు అసిఫ్. దీంతో అసిఫ్‌ను కూడా చంపాలని ముంకుంద్
ఎదురుచూస్తుంటాడు. మరి…అసిఫ్ వానీని ముకుంద్ ఏ విధంగా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? ముకుంద్ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది? అన్నది మిగిలిన కథాంశం.
విశ్లేషణ
తమిళనాడుకు చెందిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ‘అమరన్’ సినిమా తీశారు. శివ అరూర్, రాహుల్‌సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ పుస్తకంలోని ‘మేజర్ వరద రాజన్’ ఛాప్టర్తో తీసిన బయోగ్రాఫికల్ మూవీ ‘అమరన్’. సో..తెరపై ముకుంద్ జీవితమే తెరపై కనిపి స్తుంది. ముకుంద్…వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని భలేగా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు పెరియసామీ.
సౌత్ కశ్మీర్లో మేజర్‌గా ముకుంద్ చేసే ఓ మాక్ డ్రిల్ ఏటాక్తో సినిమా మొదలవుతుంది. ఈ సీన్ మంచి హైలో ఉంటుంది. దీంతో ఆడియన్స్ వెంటనే సినిమాలోకి వెళ్లిపోతారు. ఇందు పాయింట్ ఆఫ్ వ్యూలో కథసాగుతున్నప్పటికీని ఆ ఫీల్‌ను కలిగించని స్క్రీన్ ప్లే సినిమాలో ఉంటుంది. ఆపరేషన్ అఫ్తాబ్‌ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు సూపర్భ్‌గా అనిపిస్తుంది. ఇంట్రవెల్ మంచి హైతో ముగుస్తుంది. సెకండాఫ్ అంతా అసిఫ్ వానీ వర్సెస్ ముకుంద్ అన్నట్లుగా సాగుతుంది. క్లైమాక్స్ మంచి ఎమోషన్‌తో ముగుస్తుంది.
యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, ప్రేమ, బాధ్యత, అంకితభావం…ఈ అంశాలన్నింటినీ దర్శకుడు కథలో బాగా బ్లెండ్ చేశాడు. అఫ్తాబ్ అపరేషన్ సక్సెస్ అయినప్పుడు ఆడియన్స్ విజిల్స్ పడతాయి. అంతలా ఆడి యన్స్ ను ఏంగేజ్ చేశాడు దర్శకుడు. ఆర్మీవాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో, వారి అంకితభావం ఎలా ఉంటుందో సినిమాలో చూపించిన తీరు ప్రశంసనీయం. సాధారణంగా ఈ తరహా సినిమాల్లో కామెడీకి స్కోప్ తక్కువ. కానీ ముకుంద్ తల్లి పాత్రతో తొలిభాగంలో ఉన్న అతి తక్కువ కామెడీ ఆడియన్స్‌ను నవ్విస్తుంది.
భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యే స్క్రీన్ ప్లే కూడా ఉంది. కానీ ఎమోషనల్ సీన్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో అసిఫ్ వీనీ…హోస్టేజ్ అపరేషన్ ఎందుకు? అనే రీజన్ సరిగా ఎస్టాబ్లిష్ కాదు. ముకుంద్‌పై అసిఫ్ దాడి చేసినప్పుడు…అక్కడ హీరో ఒక్కడే ఉంటాడు. కానీ తన టీమ్‌తో ఉన్నప్పటికీని అసిఫ్ అక్క డ్నుంచి పారిపోవడం ఆడియన్స్‌ను కన్విన్స్ చేయదు.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఈ సినిమాలో ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ నటనను ఆడియన్స్ మెచ్చుకునేలా ఉంటుం ది. ముకుంద్ పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు అలాంటిది. ఇంట్రవెల్ సీన్లో శివకార్తికేయన్ యాక్షన్,బుల్లెట్ దిగిన గాయంతో ఇంటికి వచ్చినప్పుడు ఎమోషనల్ సీన్స్, ఇందు తండ్రి జార్జ్‌ను ఒప్పించే సీన్లో మెచ్యూర్డ్ యాక్టింగ్…ఇలా అన్నివిధాలా మెప్పించాడు శివకార్తీకేయన్. ఇక హీరోకు ఏ మాత్రం తగ్గని పాత్ర ఇందులో సాయిపల్లవి అదుర్స్ అనిపించారు. ప్రేమకోసం ముకుంద్తో ఫోన్లో సంఘర్షణ పడే సీన్, ముకుంద్‌పై కశ్మీర్లో దాడి జరిగినప్పుడు ఆమె పడే బాధ వంటి సీన్లో సాయిపల్లవి యాక్టింగ్ రేంజ్ ఏం టో తెలుస్తుంది.
అయితే సాయిపల్లవి మెజారిటీగా ఎమోషనల్ సీన్స్‌లోనే కనిపిస్తారు. విక్రమ్ సింగ్‌గా భువన్ అరోరా, కల్నల్ అమిత్సింగ్గా రాహుల్ బోస్‌కు గుర్తిండిపోయే పాత్రలు దక్కాయి. ముంకుంద్తల్లి గీతగా గీతా కైలాసం, ఇందు తండ్రి పాత్రలో శ్యామ్ ప్రసాద్ రాజ్‌గోపాల్, అల్తాఫ్‌గా షిరుఫ్, అసిఫ్వానీగా రోహ్మాన్ చేశారు. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం బాగున్నాయి. జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన బలం.
Ramayana: రామాయణ.. ఆ ముగ్గురు అవుట్?