షారుక్‌ఖాన్ (Shah Rukh khan) టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘జవాన్’(Jawan). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. నయనతార హీరోయిన్గా, విజయ్‌సేతుపతి కీలకపాత్రలో నటించగా దీపికా పదుకొనె స్పెషల్ రోల్ చేశారు. షారుక్ భార్య గౌరీఖాన్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాను ముందుగా జూన్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్‌లో ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా కొనసాగుతుండటంవంటి కారణాల వల్ల ‘జవాన్’ చిత్రం వాయిదా పడినట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైఅధికారిక ప్రకటన రానుంది.
ఈ సినిమా కాకుండ షారుక్‌ఖాన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ‘డంకీ’ అనే సినిమా చేస్తున్నారు. తాప్సీ హీరోయిన్. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది.