RajinikanthRobo: రజనీకాంత్ కెరీర్లో ‘రోబో’ సినిమా బ్లాక్‌బస్టర్. 2010లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపింది. ఈ సినిమాలో ప్రొఫెసర్ కమ్ సైంటిస్ట్ వశీకరన్ పాత్రలోరజనీకాంత్ నటించారు. ఈ సినిమాలోని విలన్ సైంటిస్ట్ బోరా పాత్రలో డానీ నటించారు. అయితే ఈ సినిమాలోని డానీ పాత్రకు తొలుత సత్యరాజ్‌ను సంప్రదించారు దర్శకుడు శంకర్. కానీ సత్యరాజ్‌కు పాత్ర నచ్చకపోవడంతో ఆయన ‘రోబో’ సినిమాను తిరస్కరించారు. ఈ విషయాలను సత్యరాజ్ వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
1986లో కావేరీ జలాల విషయంలో రజనీకాంత్, సత్యరాజ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అప్పట్నుంచి వీరద్దరి మధ్య సయోధ్య లేదన్నది కోలీవుడ్ టాక్. అయితే అలాంటిది ఏమీ లేదని, నిజానికి రజనీకాంత్ ‘శివాజీ’, ‘రోబో’ సినిమాల్లో నటించేందుకు తనకు అవకాశాలు వచ్చాయని, కానీ ఆ పాత్రలు నచ్చక పోవడంతో ఒప్పుకోలేదని సత్యరాజ్ చెబుతున్నారు.
38 సంవత్సరాల తర్వాత…
రజనీకాంత్, సత్యరాజ్ చివరిసారిగా నటించిన చిత్రం ‘మిస్టర్ భరత్’. ఈ సినిమాలో తండ్రీకొడుకుల పాత్రల్లో సత్యరాజ్, రజనీకాంత్ చేశారు. తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించారు. అయితే మళ్లీ ఇప్పుడుఈ ఇద్దరు కలిసి యాక్ట్ చేయనున్నారు. రజనీకాంత్ 171వ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. సన్‌పిక్చర్స్ నిర్మించనుంది. ఈ సినిమాలోనే సత్యరాజ్ నటించనున్నారు. ఈవిషయాన్ని ఆయన ఇటీవల వెల్లడించారు. ‘కూలీ’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రజనీకాంత్కుఫ్రెండ్ పాత్రలో సత్యరాజ్ నటిస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాల నుకుంటున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే…రోబో సినిమాలో హీరోగా నటించే తొలి చాన్స్ కమల్‌హాసన్‌కు వచ్చిందట. కానీ కమల్ ఒప్పుకోకపోవడంతో రజనీకాంత్ చేశారని కోలీవుడ్ భోగట్టా.