SamanthaRuthPrabhu: ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్ (Ramcharan), సమంత (SamanthaRuthPrabhu) జంటగా నటించారు. స్క్రీన్‌పై వీరి ఫెర్మార్మెన్స్ ఆడియన్స్‌ను అలరించింది. అయితే ఈ జంట మరోసారి ఆడియన్స్‌ను కనువిందు చేయనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ లో వినిపిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా (RC16) రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు ఇప్పటివరకు జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సమంత పేరు తెరపైకి వచ్చింది. కానీ అనారోగ్య కారణాలతో కొంతకాలం సమంత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సమంత ఇటీవల ఓ సినిమాకు ఒప్పుకోలేదు. పైపెచ్చు సమంత చేయాల్సిన, కమిటైన సినిమాలు కూడా వేరు హీరోయిన్స్ టేకోవర్ చేశారు. ఈ తరు ణంలో రామ్‌చరణ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.
అయితే ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ ఓ నిర్మాత. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో చరణ్‌కు జోడీగా నటించారు సమంత. అలాగే సుకుమార్ మాట విని కెరీరీలోనే తొలి సారి ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావామామ సాంగ్’ చేశారు.మరి..మళ్లీ ఇప్పుడు సుకుమార్ జోక్యం చేసు కుంటే ఈ సినిమాలో సమంత భాగం అయ్యే అవకాశాలు లేకపోలేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తారని తొలుత వార్తలు వచ్చినప్పుడు ఎవరూ అంతగా నమ్మలేదు. కానీ అదే నిజమైంది. ఇప్పుడు రామ్‌చరణ్– సమంతల జోడీ కూడా నిజం కావాలని చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఈ సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ మూవీ. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుంది. ఏప్రిల్‌లో సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. 2025లో సినిమా విడుదల కావొచ్చు.