Samantha CitadelHoneyBunny Review:
నటీనటులు: సమంత, వరుణ్‌ధావన్, కశ్వీ మజ్ముందర్, కేకే మీనన్, సిమ్రాన్, తలైవాసల్ విజయ్
దర్శకత్వం: రాజ్ అండ్ డీకే
నిర్మాణం: అమెజాన్ ప్రైమ్ వీడియో
మొత్తం ఎపిసోడ్స్: 6
స్ట్రీమింగ్ తేదీ: 2024 నవంబరు 7
రేటింగ్:2.5/5
కథ
హనీ (సమంత) ఓ నటి కావాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. బన్నీ (వరుణ్‌ధావన్) సినిమాలకు పనిచేసే ఓ స్టంట్‌మ్యాన్. డబ్బు కోసం కేవలం సినిమాలే కాదని, వేరే పనులు కూడా చేసుకోవచ్చని, తాను అలానేఏ సీక్రెట్ ఏజెన్సీకి ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నానని బన్నీ చెబుతాడు. హనీ ఆర్థిక పరిస్థితి ఏం బాగుండదు. దీంతో బన్ని చెప్పినట్లు చేయడానికి హనీ ఒప్పుకుంటుంది. అయితే ఏజెన్సీ హెడ్ బాబా (కేకే మీనన్) అను మతి తీసుకోకుండానే ఆపరేషన్ డిసౌజాలో హనీని భాగం చేస్తాడు బన్నీ. ఈ ఆపరేషన్‌లో భాగంగా హనికిబుల్లెట్ తగిలి గాయపడుతుంది. కానీ ఎజెన్సీ వ్యవహరాల్లో బన్నీ ఇన్వాల్వ్మెంట్ బాబాకు ఏమాత్రం నచ్చదు (CitadelHoneyBunny Review)
హనీ సమర్థవంతమైన అమ్మాయి అని బాబా ముందు నిరూపించేందుకు బన్నీయే హనీకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఈ ఏజెన్సీ బేల్గ్రేడ్లో మరో ఆపరేషన్ టేకప్ చేస్తుంది. డాక్టర్ రఘు రావు (తలైవాసల్ విజయ్)కు వచ్చే అర్ముడా పరికరాన్ని సొంతం చేసుకోవాలని బాబా, హనీ, బన్నీ అండ్ గ్యాంగ్ స్కేచ్ వేస్తారు. మరోవైపు సిటాడెల్ ఏజెంట్ల నిఘా కూడా డాక్టర్ రఘురావుపై ఉంటుంది. అయితే బేల్గ్రేడ్ ఆపరేషన్‌లో జరిగిన కొన్ని ఘటనలు బాబా, హనీ, బన్నీ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇదంతా 1992లో జరుగుతుంది (CitadelHoneyBunny )
బేల్గ్రేడ్ ఆపరేషన్‌లో చనిపోయిందుకున్న హనీ బతికే ఉందని ఎనిమిది సంవత్సరాల తర్వాత బాబా అండ్ గ్యాంగ్‌కు తెలుస్తుంది. మరో వైపు సిటాడెల్ ఏజెంట్స్ కూడా హనీ, ఆమె కూతురు నాడియాను వెంబడిస్తుం టారు. అసలు…బేల్గ్రేడ్లో ఏం జరిగింది? అర్ముడా పరికరం సాంకేతికంగా ఎలాంటి మార్పులను తీసుకు రాగలదు. ఆపరేషన్ తల్వార్‌కు సంబంధించి.. సీటాడెల్ హెడ్ జూనీ (సిమ్రాన్)కి, విశ్వకు ఉన్న సంబందం ఏమిటి? తమ కూతురు నాడియా రక్షణకు హనీ, బన్నీ ఏం చేస్తారు? అన్న విషయాలు సిరీస్‌లో చూడాలి.
విశ్లేషణ
రాజ్ అండ్ డీకే (Raj And Dk) తీసిన ‘ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ’ వంటి వెబ్‌సిరీస్‌లకు వెబ్ ఆడియన్స్ నుంచి వీపరితమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘ఫ్యామిలీమ్యాన్’ సీజన్ 2లో సమంత చేసిన రాజ్యలక్ష్మీ పాత్రఅయితే నటిగా ఆమెను మరో మెట్టు ఎక్కేలా చేసింది. బాలీవుడ్‌లోనూ సమంతకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇటు సమంత, రాజ్ అండ్ డీకేల కాంబినేషన్…అటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ధావన్ ఈ ప్రాజెక్ట్‌కు అసోసియేట్ అవ్వడం, హిట్ అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’తో ‘సిటాడెల్: హనీబన్నీ’కి కనెక్షన్ ఉండటం వంటి అంశాలు…‘సిటాడెల్ హనీబన్నీ’ సిరీస్‌పై ఆడియన్స్‌లో అంచనాలను క్రియేట్చేశాయి.
కానీ ‘సిటాడెల్ హనీబన్నీ’ సిరీస్ ఈ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పవచ్చు. కథ ప్రధానంగా 1992– 2000ల మధ్య జరుగుతున్నట్లుగా చూపించారు. 1992 నైనిటాల్, 2000 ముంబైలో జరిగే ఘటనలను మార్చి, మార్చి స్క్రీన్‌పై చూపించారు. స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ కొత్తగా అనిపించవు. గతంలో చూసినవిగానే అనిపిస్తాయి. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సమంత యాక్షన్ బాగుంటుంది.
Dulquer Salman LuckyBaskar: లక్కీభాస్కర్..అసాధారణ ప్రయాణం
అసలు ఏం జరుగుతుందన్న కన్ఫ్యూజన్తోనే తొలి ఎపిసోడ్ పూర్తవుతుంది. హనీ, బన్నీల లవ్‌ట్రాక్‌తో రెండో ఎపిసోడ్ ఉంటుంది. కానీ అసలైన కథ థర్డ్ ఎపిసోడ్‌తో ప్రారంభం అవుతుంది. నాలుగో ఎసిపోడ్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ సగటు ఆడియన్స్ ఊహించదగినవిగానే ఉంటాయి. అర్ముడా పరికరాన్ని దక్కించుకోవడం, నాడియా రక్షణలతో సిరీస్ క్లైమాక్స్ వస్తుంది. ఈ దశలో పవన్ కళ్యాణ్ ‘పంజా’, షారుక్‌ఖాన్ ‘పఠాన్’ సినిమాలు గుర్తుకు రావొచ్చు. హనీ–బన్నీ–నాడియాల మధ్యమంచి ఎమోషనల్ బాండింగ్‌ను క్రియేట్ అవ్వలేదు. అసలు కథ మొదలైన తర్వాత సమంత ఒక ట్రాక్‌లో ఉండే, వరుణ్ మరో ట్రాక్‌లో ఉండాడు. విలన్ స్టోరీ మరోకటి ఉంటుంది. ఇలా కథకు ఆడియన్స్దూరం అవుతుంటారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉంటాయి.
నటీనటులు
హనీ ఆలియాస్ సత్య పాత్రలో సమంత (Samantha Ruth Prabhu) బాగానే ఉంటుంది. యాక్షన్ సీన్స్‌లో సమంత కష్టం కనపడు తుంది. కొన్ని సీన్స్‌లో సమంత మార్క్ యాక్టింగ్ చూడొచ్చు. కానీ కథలో ఆమె పాత్ర కాస్త రోటీన్‌గా ఉంటుంది. సమంత– కశ్వి కాంబినేషన్లోని సన్నివేశాలు ఫర్వాలేదు. నాడియాగా చైల్డ్ ఆర్టిస్టు కశ్వి యాక్టింగ్ బాగుంటుంది. సమంత–నాడియా కాంబినేషన్ సీన్స్‌లో కశ్వీ యాక్టింగ్ టాలెంట్ కనిపిస్తుంది. బన్నీ ఆలియాస్ రుహీ గంభీర్‌గా వరుణ్‌ధావన్ (VarunDhavan) కనిపిస్తాడు. వరుణ్ పాత్రలో యాక్షన్ ఈజ్ ఉంటుందీ కానీ యాక్షన్ సీన్స్ తక్కువే. ఒకట్రెండు సన్నివేశాల్లోనే వరుణ్స్థాయి యాక్టింగ్ కనిపిస్తుంది. బాబా అలియాస్ విశ్వ ఆలియాస్ గురుగా కేకే మీనన్‌కు స్ట్రాంగ్ రోల్ పడింది. ఒకే పాత్రలో మూడు రకాల వేరియేషన్స్ అనేది ఆడియన్స్‌కు కాస్త కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తుంది. జూనిగా సిమ్రాన్ రోల్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. వరుణ్ ఫ్రెండ్స్‌గా షాన్‌గా సికిందర్ ఖేర్, లుడోగా సోహం మంజుదార్, చాకోగా శివన్‌కిత్ సింగ్, విలన్ కేడీగా సాకిబ్ సలీమ్ వారి వారి పాత్రల మేరకు నటించారు.