రౌడీబాయ్స్…ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్రదర్ నిర్మాత శీరిష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సినిమా ఇది. ఎప్పుడో విడుదల కావాల్సిన రౌడీబాయ్స్ కరోనా వల్ల రిలీజ్ వాయిదా వేసుకున్న లిస్ట్‌లో ఉంది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడు తూనే ఉంది. చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకుని దసరాకు రిలీజ్‌కు రెడీ అయ్యారు. కానీ పండక్కి మూడు సినిమాలు ఉండటంతో రౌడీబాయ్స్ వెనక్కి తగ్గారు.
రీసెంట్ టైటిల్ సాంగ్ లాంచ్ జరిగింది. విజయ్ దేవరకొండ గెస్ట్‌గా వచ్చారు. ఆ సమయంలో ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించార దిల్ రాజు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 19న విడుదలయ్యే అవకాశాలు కూడా కనపడటం లేదు. దిల్ రాజు స్ట్రాటజీకి తగ్గ ప్రమోషన్స్ లేకపోవడమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి.రౌడీబాయ్స్ రిలీజ్ దిల్ రాజును ఇబ్బంది పెడుతుందా? అసలు రౌడీబాయ్స్ థియేటర్స్‌లోకి ఎప్పుడు వస్తారు? అనే వాటిపై త్వరలో స్పష్టత రానుంది. ఇక హుషారు ఫేమ్ హర్ష డైరెక్ట చేసిన ఈ రౌడీబాయ్స్ చిత్రంలో హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్, మరో లీడ్ క్యారె క్టర్‌లో విక్రమ్ (నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు) నటించారు.