RishabShetty Kantara2: కన్నడ చిత్రం ‘కాంతార’ది బ్లాక్‌బస్టర్ జర్నీ. మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా, కాంతార సినిమాలు ఒకే రోజు అంటే.. 2022 సెప్టెంబరు 30న విడుదలకు రెడీ అయ్యాయి. ‘పొన్నియిన్‌సెల్వన్’ జోరుతో ‘కాంతార’ సినిమా గురించి ఎవరూ అంతగా మాట్లాడుకోలేదు. అసలు..కన్నడలో ‘కాంతార’ అనే ఓ సినిమా విడుద అవుతుందన్న విషయం కూడా అప్పట్లో సరిగా ప్రచారంలోకి రాలేదు.
2022 సెప్టెంబరు 30న ‘కాంతార’, ‘పొన్నియిన్ సెల్వన్1’ సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి. మొ దట్లో ‘పొన్నియిన్ సెల్వన్ 1’ హవా కనిపించింది. కానీ ‘కాంతార’ చిత్రం చాపకిందనీరులా వచ్చింది. కన్న డలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. రెండు వారాల తర్వాత తెలుగులో విడుదలైంది. తెలుగులోనూ బ్లాక్ బస్టర్. హిందీ, తమిళం, మలయాళం అన్నీ చోట్ల బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం 20 కోట్ల రూపాయల లోపే ‘కాంతార’ సినిమాను తీయగా, 400 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది కాంతార చిత్రం. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి సైతం జాతీయ అవార్డు అందుకున్నారు.
కాంతార సినిమా విడుదలైన తర్వాత అందరు కాంతార సినిమాకు సీక్వెల్‌గా ‘కాంతార 2’ను ఊహించారు. కానీ ఈ చిత్రం హీరో– దర్శకుడు రిషబ్‌శెట్టి అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, ‘కాంతార’సినిమాకు పీక్వెల్ను ప్రకటించాడు. కోంకణ్ సాంప్రదాయం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలు స్తోంది. లేటేస్ట్‌గా ‘కాంతార’ ప్రీక్వెల్ సినిమాను అక్టోబరు2, 2025న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధి కారికంగా ప్రకటించారు. ఏ మాత్రం బజ్, అంచనాలు లేని సమయంలోనే ‘కాంతార’ చిత్రం 400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందంటే, ఈ సారి ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరోవైపు ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్‌శెట్టి, ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘హనుమాన్’ సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్‌వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.