తెలుగులో హీరోగా నటిస్తూ వీలైనప్పుడల్లా నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మహేశ్‌బాబు, కల్యాణ్‌రామ్, రామ్‌చరణ్ రీసెంట్గా నాని, విజయ్ దేవరకొండ ఇలా కొందరు హీరోలు నిర్మాతగా ఉంటూ సినిమాల్లో హీరోలుగా చేస్తున్న వారే. ఇప్పుడు వీరి జాబితాలోకి రవితేజ కూడా చేశారు. ‘రవితేజ టీమ్ వర్క్స్ ’అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు రవితేజ. త్వరలో ఈ ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించనున్న సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. మరి..ఈ ప్రొడక్షన్ హౌస్‌లో తన సినిమాలే చేస్తారా? లేక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే చేస్తారా? అన్నది చూడా లి. మరి..ఈ కొత్త రూట్ రవితేజకు ఏ మాత్రం కలిసొస్తుందో కూడా చూడాలి. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసి శరత్ మండవ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రవితేజ. అలాగే ‘నేను..లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా కమిటైయ్యారు. డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ సినిమాలో రవితేజ హీరోగా ఓ సినిమా ఉంటుందని గతంలో ఓ ప్రకటన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.