Ramayana: భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. వస్తూనే ఉంటాయి. ఈ కథలో ఉన్న గ్రిప్ అలాంటింది. అలా ఈ తరం నటీనటులతో ‘రామాయణ’ సినిమాను నిర్మాతలు అల్లు అరవింద్, మధుమంతెన, నమిత్ మల్హోత్రా తెరకెక్కించాలనుకున్నారు. దర్శకత్వ బాధ్యతలను బాలీవుడ్ దర్శకుడు రవి ఉడయార్, నితీష్ తివారిలకు అప్పజెప్పారు.(Ramayana)
రవి, నితీష్‌లు ‘రామాయణ’ ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా కష్టపడ్డారు. ఏమైందో ఏమో తెరపైకి రాలేదు కానీ…రవి ఉడయార్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ అంతా నితీష్ తివారియే చూసు కుంటున్నారు. కానీ ఊహించని విధంగా నిర్మాతలు అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెనలమధ్య ఈ ప్రాజెక్ట్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలునిజమే అన్నట్లుగా కన్నడ సూపర్‌స్టార్ యశ్‌ను నిర్మాతగా చేర్చుకుని, ‘రామాయణ’ సినిమాను నిర్మిస్తున్నట్లుగా నిర్మాత నమిత్ మల్హోత్రా పరోక్షంగా వెల్లడించారు. ఊహించి నట్లుగానే..అల్లు అరవింద్, మధుమంతెనలకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆగ్రహించారు. కట్ చేస్తే…‘రామాయణ’ సినిమా టైటిల్, స్క్రిప్ట్ తదితర అంశాల్లో నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రవైట్ లిమిటెడ్‌కు హక్కులు లేవని, అల్లుమంతెనమీడియా వెంచర్స్ ఎల్ఎల్పీ పేరిట ఓ పబ్లిక్ నోటీస్ జారీ అయ్యింది. ఈ తర్వాత నుంచి హిందీ ‘రామా యణ’ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి..ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయ్యిందా? లేక తాత్కాలికంగా బ్రేక్ పడిందా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ హిందీ రామాయణలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా దేవ్ దత్తా, శూర్ఫణకగా రకుల్‌ప్రీత్‌సింగ్, లక్ష్మణుడిగా నవీన్పొలిశెట్టి నటిస్తున్నట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరి పాత్రలూ ఎలా ఉన్నా…రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌కు ఇలా సడన్ బ్రేక్ పడటం మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త నిరాశే.