గేమ్‌చేంజర్ (GameChager Release) సినిమా రిలీజ్ మరోసారి సారి మారింది. ఈ ఏడాది క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని దసరా ఫెస్టివల్ సందర్భంగా శనివారం ఓ అఫిషియల్ వీడియోను రిలీజ్ చేసి కన్ఫార్మ్ చేశారు దిల్ రాజు. ”గేమ్‌చేంజర్’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్‌కు ప్లాన్ చేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్లు, మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వారి అభిప్రాయాల సూచనల ప్రకారం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం” అంటూ’దిల్’ రాజు ఓ వీడియోను రిలీజ్ చేశారు.
విశ్వంభర అవుట్ గేమ్‌చేంజర్ ఇన్
నిజానికి జనవరి10న చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా ఆ డేట్‌కు రిలీజ్ కావడం లేదు. ఇటీవల చిరంజీవి చివెన్గున్యా బారిన పడ్డారు. దీంతో నెలరోజులకు పైగా విశ్రాంతి తీసకున్నారు. దీంతో విశ్వంభర చిత్రం షూటింగ్ సజావుగా సాగలేదు. దీంతో ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ వాయిదా వేయక తప్పని పరిస్థితి. విశ్వంభర చిత్రం రిలీజ్ పోస్ట్‌పోన్ బయటకు వస్తే ఈ స్లాట్‌ను మరో సినిమా దక్కించుకునే చాన్స్ ఉంది. దీంతో ఈ సంక్రాంతి స్లాట్‌ను మరోకరు దక్కించుకోకుండ ఓ ప్లాన్ ప్రకారం ‘గేమ్‌చేంజర్’ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక ‘విశ్వంభర’ సంక్రాంతి స్లాట్‌ను తమకు ఇచ్చిన చిరంజీవికి థ్యాంక్స్ కూడా చెప్పారు ‘దిల్’రాజు.
GameChager Release పలుమార్లు వాయిదా
కాస్త అతిశయోక్తిగా అనిపించిన ‘గేమ్‌చేంజర్’ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ‘దిల్’ రాజు ఓ సందర్భంగా చెప్పారు. కానీ గేమ్‌చేంజర్ సినిమాకు దర్శకుడిగా ఉన్న శంకర్‌యే, ‘ఇండియన్ 2’ కూడా తీయాల్సి వచ్చింది. దీంతో ‘గేమ్‌చేంజర్’ సినిమా షూటింగ్ స్లో అయిపోయింది. ఇలా గేమ్‌చేంజర్ సినిమా రిలీజ్ వాయిదా పడక తప్పలేదు. ఆ తర్వాత గేమ్చేంజర్ను ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్చేయాలని ‘దిల్’ రాజు ప్లాన్ చేశారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత క్రిస్మస్కు అన్నారు వీలుపడలేదు. ఫైనల్‌గా ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేశారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్‌చేంజర్
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్‌చేంజర్. ఇందులో తండ్రీకొడుకులగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినం చేస్తున్నారు. ప్లాఫ్బ్యాక్ ఏపిసోడ్స్‌లో రామ్‌చరణ్ సరసన అంజలి, కరెంట్ రామచరణ్ సరసన కియారా అద్వానీ జోడీగా కనిపిస్తారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరాం, నవీన్‌చంద్ర, ప్రియదర్శి, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.