Double ISMART: రామ్ కెరీర్లో ఇస్మార్ట్‌శంకర్ సూపర్‌హిట్. పూరీ జగన్నాథ్ దర్శకుడు. వీరి కాంబినేషన్లో లేటెస్ట్గా ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double ISMART) సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా తాజాగా ప్రకటించారు మేకర్స్. తొలుత ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమానుమార్చి 18న శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ సజావుగా లేదు. బడ్జెట్ఇష్యూష్ అనే టాక్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత రామ్, పూరీల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని దీంతో దాదాపు రెండు నెలలు చిత్రీకరణ జరగలేదని దీంతో డబుల్ ఇస్మార్ట్ చిత్రం విడుదల వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి. సంజయ్‌దత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు.
tollywood:ప్రీ ప్రొడక్షన్స్‌లోనే ఫ్లాప్!
‘ఇస్మార్ట్‌శంకర్’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీనే ఉంది. ‘ఇస్మార్ట్‌శంకర్’ సినిమా హిందీలో కూడా రిలీజ్ కానుంది. కానీ ఇదే రోజున అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘ఖేల్ఖేల్మే’, జాన్ అబ్రహాం ‘వేద్’సినిమాలు రిలీజ్ కానున్నాయి హిందీలో. ఇలా హిందీ బాక్సాఫీస్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’కు గట్టి పోటీనే ఉంది.పైగా పూరీ జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ హిందీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. కాబట్టి ‘డబుల్ఇస్మార్ట్’ సినిమా రిలీజై, మంచి టాక్ వస్తేనే థియేటర్స్ లభిస్తాయి.
ఇటు దక్షిణాదిలోనూ డబుల్ఇస్మార్ట్కు పోటీగా కీర్తీసురేష్ ‘రఘుతాతా’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలను తీసిన హోంబలే ఫిలింస్ నిర్మించిన తొలి తమిళ సినిమా ఇది.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
PushpaTheRule: పుష్పకి కొత్త తలనొప్పులు…!
ఒకవేళ ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ సినిమా రాకపోవడం కన్ఫార్మ్ అయినట్లయితే ఈ తేదీన మరో రెండు మీడియం హీరోల సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.