(Rakshana) కథ: కిరణ్, ప్రియా స్నేహితులు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటుంది కిరణ్. యూనీవర్సిటీ టాపర్‌గా భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరడానికి రెడీ అవుతుంది ప్రియా. కానీకిరణ్ కళ్ల ముందే ఓ భవనంపై నుంచి దూకి ప్రియ చనిపోతుంది. ఆ స్పాట్లో లాలీపప్ తింటూ అనుమానాస్పందంగా కనిపించిన ఓ వ్యక్తిని గమనిస్తుంది కిరణ్. తనే ప్రియను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని నమ్ముతుంది. ఈ విషయం పోలీసులకు చెప్పిన వారు వినిపించుకోరు. ఆత్మహత్యగా ప్రియ కేసును క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఏపీసీగా కిరణ్ బాధ్యతలు స్వీకరిస్తుంది.
ఓ ఈవ్‌టీజింగ్ కేసులో అరుణ్ (మానస్)రి వార్నింగ్ ఇస్తుంది. దీంతో కిరణ్‌పై కక్ష పెంచుకుంటాడు అరుణ్. ఆమె ఫోటోను కాల్గార్ల్స్ వెబ్సైట్లో కనిపించేలా చేస్తాడు. దీంతో కిరణ్‌కు కొత్త సమస్యలు మొదలవుతాయి. ఓ రోజు అరుణ్నుపట్టుకుందామని వెళితే, కిరణ్ కళ్లముందే అరుణ్ ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పై నుంచి కిందపడి చనిపోతాడు.కిరణ్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడు తున్నాన్నట్లుగా అరుణ్ వీడియో ఒకటి బయటకు వస్తుంది. దీంతో కిరణ్‌ను పై అధికారులు సస్పెండ్ చేస్తారు. కానీ అరుణ్‌ది ఆత్మహాత్య కాదని, ప్రియహత్య అని కిరణ్ అంటుంది. పోలీసులు పట్టించు కోరు. పైగా లేనిపోనివి కిరణ్ ఊహించుకుంటుందని,ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తారు. కానీ కిరణ్ తనపై నమ్మకంతోపట్టుదలతో కేసును ఇన్విస్టిగేషన్ చేస్తుంది. మరి..ప్రియ, అరుణ్‌ల చావులకు కారణం ఒకేరేనా? కిరణ్ విషయంలో అరుణ్‌కు సాయం చేసిన రామ్ ఎవరు? ఇందులో రామ్ స్వార్థం ఏమైనా ఉందా? అనేదిమిగిలిన కథ
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. చాలా కథల్లో బాధితుల తరఫున పోలీసులు పోరాడి దోషులను అరెస్ట్ చేస్తారు. కానీ ఈ కథలో ఓ పోలీసే బాధితురాలిగా ఉండటం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం దర్శక–నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ కొత్తదనాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించ లేకపోయాడు. దర్శకుడిగా తొలి సినిమా కాబట్టి తడబడ్డాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆసక్తికర సిన్నివేశాలతో సినిమా సాగాలి. కానీ సినిమా స్లోగా నడుస్తుంటుంది. మానస్‌ను పోలీస్ ట్రాప్‌తో పట్టుకోవడం, ప్రియ హత్యను గుర్తు తెచ్చుకోవడం వంటి సన్నివేశాలు రోటీన్‌గా అనిపిస్తాయి. ఇంట్రవెల్ సీన్ కాస్తఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.
కానీ ఇంట్రెస్ట్ సెకండాఫ్‌లో ఉండదు. కిరణ్ ఇన్విస్టిగేషన్ చేసే ప్రతిసారి చని పోయిన అమ్మాయిల లిస్ట్‌తో పాటుగా ఓ 55 ఏళ్ల మహిళ ఎందుకు చనిపోయింది? అంటూ ప్రశ్నలు వేసుకుంటుంది. కానీ ఈ దిశగా ఇన్విస్టిగేషన్ చేయదు. క్లైమాక్స్‌లో ఆ దిశగా వెళ్లి కేసును సాల్వ్ చేస్తుంది. మరి..ఈ పని మొదట్లోనే చేయవచ్చు కదా? ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం సరైన సమా«ధానం ఉండదు. క్లైమాక్స్ ఫర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం బాగానే ఉంటుంది. అయితే విలన్ లాలీపప్ స్టోరీ సిల్లీగా ఉంటుంది. థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి అయితే ఈ సినిమా ఓ మోస్తారుగా నచ్చుతుంది. కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతకొద్దు. అడగ వద్దు కూడా.
ఏసీపీ కిరణ్‌గా పాయల్‌రాజ్‌పుత్ మంచి నటన కనబరిచింది. సినిమాను అంతా తన భుజాలపై మోసింది. సంఘర్షణకు గురైయ్యే ఏసీపీగా మంచి భావోద్వేగాలు పలికింది. ఆ తర్వాత అరుణ్గా మానస్ యాక్టింగ్ఒకే. కొన్ని సీన్స్‌లో కేవలం అరవడానికే సరిపోయింది. రామ్ పాత్రలో రోషన్‌కు పెద్ద స్క్రీన్ స్పేస్ లేదు.ఉన్నంతలో బాగానే చేశాడు. కానీ సినిమాలో ఈ క్యారెక్టర్‌ను కాస్త స్ట్రాంగ్‌గానే చూపించారు. నరసింహా,శివన్నారాయణ, వినోద్ బాల వారి పాత్రల మేరకు కనిపించారు. నిర్మాణ విలువలు బాగోలేవు. సినిమాఅంతా బడ్జెట్ పరిమితులు కనిపిస్తూనే ఉంటాయి. అనిల్ బండారి కెమెరా, మహతి స్వరసాగర్ మ్యూజిక్ ఆడియన్స్‌ను నచ్చవు. గ్యారీ బీహెచ్ ఎండిటింగ్ పని చాలనే ఉంది.